కళ్లలో కారం కొట్టి.. రూ. 11 లక్షలతో ఉడాయించారు
రాజేంద్రనగర్ : నగదు బ్యాగుతో వెళ్తున్న వ్యక్తి కళ్లలో కారం చల్లి దుండగులు రూ. 11 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటెదాన్ పారిశ్రామికవాడలో ఆదివారం చోటు చేసుకుంది. పాయల్ఫుడు బిస్కెట్ కంపెనిలో సూపర్వైజర్గా పనిచేస్తున్న అనిల్ ఈ రోజు రూ. 11 లక్షల నగదు బ్యాగుతో కంపెనీ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు.
ఆ క్రమంలో కాటెదాన్ శివారులోకి రాగానే దుండగులు అనిల్ కళ్లలో కారం కొట్టారు. దాంతో అతడు పడిపోయాడు. దాంతో దుండగులు నగదు బ్యాగుతో పరారయ్యారు. అనిల్ స్థానికుల సహాయంతో మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.