breaking news
rold gold
-
మెరిసే.. మెరిసే.. బంగారంలా.. రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్లను దాటి..
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న ధరతో సామాన్యులకి బంగారం అందని ఆభరణమే అయింది. చిన్నపాటి గొలుసు కొనాలన్నా లక్షలు పెట్టాల్సిందే. డిజైన్లు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చిందే ఇమిటేషన్ లేదా రోల్డ్ గోల్డ్ లేదా వన్‌గ్రామ్ గోల్డ్ నగలు. ఏ పేరుతో పిలుచుకున్నా వీటి కేరాఫ్ అడ్రస్ కృష్ణా జిల్లా చిలకలపూడి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గిల్ట్ నగలు తయారు చేయడం చిలకలపూడి కళాకారుల గొప్పతనం. బాగా డిమాండ్ ఉన్న యాంటిక్ నగల్లో కూడా కొత్త డిజైన్లు సృష్టిస్తూ మహిళల మనసులు దోచుకుంటున్నారు. లక్షలు విలువ చేసే బంగారు బ్రైడెల్ సెట్స్‌ను రూ.5,000 నుంచి రూ.25,000కే అందిస్తున్నారు. సినిమాల్లో, సీరియల్స్‌లో నటీనటులు ధరించే ఆభరణాల్లో అత్యధిక శాతం చిలకలపూడిలో తయారైనవే. అంతేకాకుండా అనకాపల్లి నుంచి చికాగో వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు దేవుని అలంకరణకు ఉపయోగించే వజ్ర, వైఢూర్యాలు పొదిగిన కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడివే. ఒక కుటుంబంతో ఆరంభం 114 ఏళ్ల క్రితం ఒక కుటుంబంతో ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు గోల్డ్ పార్క్ ఏర్పాటుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. 1908లో మచిలీపట్నానికి సమీపంలో ఉన్న చిలకలపూడి గ్రామంలో టేకి నరసింహం అనే స్వర్ణకారుడి ఆలోచన నుంచి మొదలయ్యింది ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారం. బంగారం ధరలు భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజల కోసం రాగి మీద బంగారం పూతతో ఆభరణాల తయారీని మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 100 ఉండే బంగారం దిద్దులను కేవలం పావలాకే అందించడంతో ఈ రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. వైఎస్సార్ చొరవతో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు దేశంలో ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోటీని తట్టుకోలేక చిలకలపూడి తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, మచిలీపట్నం ఇమిటేషన్ గోల్డ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పాటు చేశారు. 2007లో 48 ఎకరాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ పార్కు ఏర్పాటైంది. ఇప్పుడు ఈ పార్కులో 236 యూనిట్లలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తోంది. మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉండే 24 గ్రామాలకు చెందిన 27 వేల మందికి పైగా మహిళలు ఇంటి వద్దే ఆభరణాలు తయారు చేస్తూ పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు రూ.200 నుంచి రూ.450 వరకు సంపాదిస్తున్నారు. ప్లేటింగ్, క్యాడ్, కాస్టింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట ఉండటంతో ఈ పార్కులో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తొలుత రూ.10 కోట్లుగా ఉన్న చిలకలపూడి వ్యాపారం రూ.100 కోట్లను అధిగవిుంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అదే బాటలో జగన్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్క్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది. రూ. 8 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, ఈటీపీ ఆధునికీకరణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. నూతన డిజైన్ల రూపకల్పనకు క్యాడ్, కాస్టింగ్ వంటి వాటిలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. -
చుక్కల్లో బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఇదే!
పాత గుంటూరు: ఆభరణాలంటే మక్కువ చూపని వనితలు ఉండరు. ప్రతి మహిళకు వివిధ రకాల ఆభరణాలు ధరించి తోటి వారి ముందు హుందాగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా పండుగలకు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేక ఆభరణాలు వేసుకొని ముస్తాబవడానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుంటారు. ధనవంతులు బంగారు, వెండి వస్తువులు కొనుగోలుకు ముందుకెళ్తుండగా ఆర్ధిక పరిస్ధితి అనుకూలించని వారు బంగారు ఆభరణాలు ధరించి ముచ్చట తీర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే మహిళలు ప్రత్యామ్నాయంగా రోల్డ్ గోల్డ్ వస్తువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవి కూడా అచ్చం బంగారు వస్తువుల్లాగే కనిపించడంతో చాలా మంది వివిధ రకాల మోడళ్ల వస్తువులను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ధనవంతులు కూడా బంగారంతో పాటు రోజువారీ కోసం రోల్డ్ గోల్డ్ వస్తువులపై మొగ్గు చూపుతున్నారు. మహిళల అభిరుచిని దృష్టిలో వుంచుకొని వ్యాపారులు కూడా లేటెస్ట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు గోల్డ్ షోరూమ్‌లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపా రం మూడు చైన్లు, ఆరు నెక్లెస్ల్లా వెలిగిపోతోంది. (చదవండి: ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!) పండుగ సమయాల్లో విక్రయాల జోరు పండుగ సమయాల్లో రోల్డ్ గోల్డ్ ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. నగరంలోని ప్రతి దుకాణం వినియోగదారులతో కళకళలాడుతుంది. చిన్నారులు, యువతులు, పెద్దవారు ఇలా అంతా వారి కి కావల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్ధినులు లేటెస్ట్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వేసుకుని సందడి చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా దుకాణాలు... ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలను అంటుతున్న సమయంలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో 50 వరకు రోల్డ్ గోల్డ్ దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ బంగారు వస్తువులను మైమరిపించే రీతిలో రోల్డ్ గోల్డ్ వన్‌గ్రామ్ బంగారు ఆభరణాలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు వినియోగించే చైన్లు, చెవిదుద్దులు, నెక్లెస్‌లు, హారాలు, గాజులు, తదితర వస్తువులు లభ్యమవుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు రూ.50 లక్షలు వరకు వ్యాపారం జరుగుతుండగా, పెళ్లిళ్లు, పండుగల సీజన్లో కోటికి పైగానే వ్యాపారం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ వస్తువులు వివిధ రకాలలో ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. చెవిబుట్టలు రకాన్ని బట్టి రూ. 250 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్‌లు రూ. 50 నుంచి 5 వేల వరకు ఉంటుంది. చైన్లు రూ.100 నుంచి 20 వేల వరకు, గాజులు రూ.100 నుంచి 3వేల వరకు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అవసరమయ్యే వడ్డానాలు రూ.400 నుంచి 10 వేల వరకు ఉంటాయి. (చదవండి: CM Jagan: థాంక్యూ సీఎం సార్ !) వ్యాపారం బాగా పెరిగింది రోల్డ్ గోల్డ్ వ్యాపారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దుకాణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రానికి చెందిన మహిళలే ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. సీజన్ బట్టి మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. – రమణారెడ్డి, షోరూం మేనేజరు -
3 వేలు పెడితే ఒంటినిండా ‘బంగారం’!
మహేష్ ఇంట్లో రేపు ఫంక్షన్.. బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. మహేష్ కూతురు మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది.. మహేష్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా.. మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. కూతురు అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు.. ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన.. ఇంతలో తళుక్కుమంటూ ఐడియా తట్టింది.. వెంటనే బందరులోని చిలకలపూడి వెళ్లాడు.. బడ్జెట్‌కు తగ్గట్టు, కూతురికి నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్లో మహేష్ కూతురు మిలమిలా మెరిసిపోయింది.. మహేష్ మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత. అది నిజంగా కొత్త ‘బంగారు’ లోకమే.. కోవిడ్‌తో కుదేలైన ఈ వ్యాపారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కాంతులీనుతోంది. మచిలీపట్నం: రోల్డ్‌గోల్డ్ నగల తయరీకి బందరు ఖ్యాతి గడించింది. బందరు కేంద్రంగా వందల ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశ్రమ ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. కోవిడ్‌తో కుదేలైనా బందరు బంగారం మళ్లీ కాంతులీనుతోంది. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడం, సాధారణ జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయటంతో రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇదీ చరిత్ర.. రోలింగ్ మెషిన్ల మీద రోల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో చేసిన నగలు కనుక వీటిని రోల్డ్ గోల్డ్ నగలు అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు పితామహుడుగా గుడివాడ మోటూరుకు చెందిన కమ్మిలి వెంకటరత్నంను పరిగణిస్తారు. ఈయన 1902లో బందరు చిలకలపూడిలో కవరింగ్ గోల్డ్ పరిశ్రమను ప్రారంభించాడు. ఆ తర్వాత అంచలంచెలుగా పరిశ్రమ అభివృద్ధి చెందగా.. 1982లో మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అండ్ ప్లేటింగ్ జ్యూయలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో పరిశ్రమను ప్రభుత్వం గుర్తించి మచిలీపట్నం శివారు పోతేపల్లిలో ‘మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూయలరీ పార్క్’ పేరుతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీని పరిధిలో 240 యూనిట్లు ఉన్నాయి. మళ్లీ కాంతులు.. ► కోవిడ్ ప్రభావంతో దాదాపు పది నెలల పాటు పూర్తిగా మూతపడిన నగల తయారీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం 90 యూనిట్లలో నగల తయారీ జరుగుతుంది. ►ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది దీనిలో భాగస్వాములవుతున్నారు. దీంతో ప్రతి రోజూ రూ.50 లక్షల మేర విలువ గల బంగారు నగలను తయారు చేస్తూ, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ►రోల్డ్గోల్ నగలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు దారులు వస్తున్నారు. ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్లి వారి వారి ప్రాంతాలో దుకాణాలు నిర్వహించుకొని విక్రయిస్తుంటారు. అ‘నగ’నగా చిలకలపూడి.. బందరు లడ్డూ, బాదం పాలుతో పాటు రోల్డ్‌గోల్డ్ నగల తయారీకి బందరు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రోల్డ్‌గోల్డ్ నగల తయారీతో పాటు, వాటిని విక్రయించేందుకు దుకాణాలు సైతం ఇక్కడ వందలాదిగా వెలిశాయి. బందరులోని ఏ వీధిలో చూసిన రోల్డ్‌గోల్డ్ నగల దుకాణాలు దర్శనమిస్తాయి. చిలకలపూడిలో ప్రతి ఇల్లూ ఓ జ్యూయలరీ పరిశ్రమే. రూ.3 వేలు పెడితే ఒంటినిండా బంగారం.. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందుబాటులేని పరిస్థితి. అంతో, ఇంతో ఆర్థికంగా ఉన్నా, మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన మోడల్స్ కొనుగోలు చేయటం కష్టంగానే మారుతోంది. అందుకనే సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారు వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై ఆసక్తి చూపుతారు. బందరులో రూ. 3 వేలు పెడితే ఒంటినిండా నగలు వేసుకోవచ్చు. గ్యారెంటీ లేనివి ఒక నెల, గ్యారంటీ ఆభరణాలు ఆరు నెలల పాటు ఫంక్షన్లు, పెళ్లిలో సింగారించుకుని జిగేల్మనచ్చు. రాయితీ లేకుంటే మూతే.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను కోవిడ్ కోలుకోలేని దెబ్బతీసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ పరిశ్రమ నిలబడేలా చేసింది. ప్రస్తుతం గతంతో పోల్చితే 60 శాతం మేర వ్యాపారం సాగుతోంది. పది నెలల పూర్తిగా మూసివేశాం. ఆ కాలానికి కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది. అన్నివర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలోని కార్మికులను కూడా ఆదుకోవాలి. – అంకెం జితేంద్ర కుమార్, అసోసియేషన్ కార్యదర్శి పదేళ్లుగా ఇదే వ్యాపారం పదేళ్లుగా రోల్డ్‌గోల్డ్ నగల విక్రయం చేస్తున్నాం. దుకాణాన్ని నేనే చూసుకుంటాను. భర్త సాయంతో పాటు, మరో ఇద్దరికి జీతం ఇచ్చి షాపులో పెట్టుకున్నాం. ఇప్పుడైతే రోజుకు రూ.15 నుంచి రూ.20 వేలు వరకు అమ్మకం సాగుతోంది. కోవిడ్ ముందైతే రూ.30 వేలు వరకు అమ్మడుపోయేవి. అన్నీ పోను రోజుకు వెయ్యి వరకు మిగులుతోంది. మంచి మోడల్స్ కొనుగోలుకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – మారుబోయిన శివాని, చిలకలపూడి తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వ రాయితీ.. ఎన్నో ఏళ్లుగా రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి సమస్యలను పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. పాదయాత్ర సమయంలో బందరు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను చూసి, తాము అధికారంలోకి వస్తే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రోల్డ్‌గోల్డ్ యూనిట్లకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. యూనిట్ విద్యుత్ వినియోగంపై వాస్తవంగా అయితే రూ. 9.50 చెల్లించాల్సి ఉంది. కానీ రోల్డ్గోల్ నగల తయారీదారులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.6 రాయితీ కల్పించింది. దీంతో పరిశ్రమ పురోభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. -
చిలకలపూడిని మింగేస్తున్న డ్రాగన్
సాక్షి, అమరావతి: చైనా.. మన భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాదు.. మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకొచ్చి మన మార్కెట్లను కబ్జా చేసేసింది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే డిమాండ్ పురుడు పోసుకోకముందే.. రోల్డ్ గోల్డ్ (గిల్టు) నగల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిలకలపూడి మార్కెట్‌ను డ్రాగన్ మింగేసింది. ‘బంగారం’ లాంటి నగలు ► చిలకలపూడి చుట్టుపక్కల దాదాపు వందేళ్ల నాటినుంచి గిల్టు నగలు తయారు చేస్తున్నారు. ► గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడి బిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదవలేదు. వీటికి 6 నెలలు, ఏడాది, రెండుమూడేళ్ల వరకు గ్యారంటీ ఇచ్చి మరీ విక్రయిస్తుంటారు. ► ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన చిలకలపూడి బంగారం కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ మార్కెట్లకు ఇమిటేషన్ నగలు అందిస్తోంది. ► కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల కుటుంబాలు (45 వేల మందికి పైగా కార్మికులు) వీటి తయారీపై జీవనోపాధి పొందుతున్నాయి. మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మొత్తం 236 పరిశ్రమలున్నాయి. ► వీటికి అనుబంధంగా మచిలీపట్నం, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇళ్ల వద్ద నగలకు రాళ్లు అద్దడం, మంగళ సూత్రాలకు మెరుగులు అద్దడం, పూసల దండలు చుట్టడం వంటి వివిధ రకాల పనులు చేస్తుంటారు. రూ.80 కోట్ల టర్నోవర్‌ను మింగేసిన డ్రాగన్ ► మచిలీపట్నం ప్రాంతంలో నెలకు సగటున రూ.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ.80 కోట్ల విలువైన ఇమిటేషన్ నగలు ఉత్పత్తి అయ్యేవి. ► గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇమిటేషన్ నగలపై కన్నేసిన డ్రాగన్ క్రమంగా చిలకలపూడి పరిశ్రమను కబ్జా చేసింది. ► ప్రస్తుతం చిలకలపూడి నగల మార్కెట్లో ఏకంగా 60 శాతం చైనా ప్రమేయం ఉంటే.. కేవలం 40 శాతం మాత్రమే స్థానికత ఉంది. ► నాణ్యత మాట అటుంచితే చైనా ఉత్పత్తుల ధర తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. లాభాలు తగ్గాయి చైనా సరుకులు తక్కువ ధరకు వస్తున్నాయనే దిగుమతి చేసుకుంటున్నాం. 60 శాతం చైనా సరుకులు మన మార్కెట్‌ను ఆక్రమించాయి. వాటి నాణ్యత ఎలా ఉన్నా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి రావడంతో లాభాలు తగ్గిపోయాయి. అవే ధరలకు మన దేశీయ మార్కెట్లో ముడి సరుకుల ఉత్పత్తి జరిగితే చైనా సరుకుల్ని బహిష్కరించవచ్చు. – పీవీ సుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వయం సమృద్ధి సాధిస్తేనే.. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం చాలా గొప్పదే. అయితే, మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా దిగువ స్థాయి వరకు ప్రయత్నం జరగాలి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిలకలపూడి గిల్టు నగల రంగాన్ని నిలబెట్టుకునే స్థాయిలో మన ప్రయత్నాలు గట్టిగా జరగాలి. – నూకల సురేష్, గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అధినేత -
రోల్డ్ గోల్డ్ చైన్ లాగి పోలీసులకు చిక్కాడు
వరంగల్ రూరల్ : పాపం ఓ దొంగ ఈ రోజు ప్రొద్దున్నేలేచి ఎవరి ముఖం చూశాడో గానీ బంగారం దొంగిలిద్దామని బయలుదేరితే చేతికి రోల్డ్ గోల్డ్ చైన్ దొరికింది. చివరికి మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ చైన్ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన వరంగల్ హంటర్ రోడ్డులో మినీ రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దారబోయిన శారద అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శారద తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. వెంటనే కేకలు వేయడంతో చుట్టప్రక్కల వారు స్పందించి దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతను దొంగిలించిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు. తీరా దొంగిలించిన గొలుసు రోల్డ్‌గోల్డ్‌ది కావడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు, దొంగ వంతయింది. లక్ష్మణ్ ఓ సైకో అని చుట్టుప్రక్కల వారు చెబుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని పోలీసులు ప్రశ్నించగా..తనది నెల్లికుదురు మండలం అని మాత్రమే చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో గోల్డా...రోల్డేనా...?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ఆభరణాలు భారతీయస్టేట్ బ్యాంకు లాకర్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. కనీసం బ్రహ్మోత్సవాల్లోనైనా పాతకాలం నాటి హారాలు, బంగారు కిరీటాలు, పాదాలు, కర్ణాలు, పెద్ద పెద్ద హారాలు, పచ్చలు పొదిగిన నగలు, చేతి కడియాలు తదితర స్వర్ణాభరణాలు కనువిందు చేస్తాయని భక్తులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిఏటా.. ఈ ఏడాది భద్రతా ఇబ్బందులున్నాయి...వచ్చే ఏడాది బంగారు నగలు తప్పక అలంకరిస్తాం.....అంటూ ఉత్సవాల నాటి ఈవోలు కాలంగడిపేస్తు వెళ్లిపోతున్నారు. భక్తులు ప్రశ్నించేందుకు వచ్చే ఏడాది ఆ ఈవోలు ఉండడంలేదు...(వరుసగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈవోలు లేరు..) బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో ఏటా గిల్టు నగలతోనే ఉత్సవాలు ముగిస్తున్నారు. భక్తులు మాత్రం తీవ్రమైన నిరాస చెందుతున్నారు. ఈ ఏడాది ఈవో కార్యాలయంలో జరిగిన పలు సమావేశాల్లో పలువురు పుర పెద్దలు బ్రహ్మోత్సవాల్లో బంగారు నగలు స్వామి, అమ్మవార్లకు అలంకరించి ఊరేగింపు చేయాలని విన్నవించారు. ఉత్సవమూర్తులను స్వర్ణాలంకారణతో దర్శించే భాగ్యం భక్తులకు కల్పించాలని కోరారు. ఈసారైనా ఆ అదృష్టం లభిస్తుందో.. లేదో? వేచిచూడాల్సి ఉంది. ’ అదిభిక్షువు వాడినేమి కోరేది... బూడిదిచ్చేవాడినేమి అడిగేది...అంటూ ఒక సినీ కవి పరమశివుడ్ని భిక్షువుతో పోల్చాడు. అయితే శ్రీకాళహస్తీశ్వరుడు ఆది నుంచి భిక్షువు కాదు. రాజులు, జమీందారులు ఆయనకు అపురూపమైన దివ్యాభరణాలను కానుకగా ఇచ్చారు. విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాయులింగేశ్వరునికి ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజు సుమారు 14వేల ఎకరాల కైలాసగిరులను ఇచ్చారు. అయితే ఆనాటి ఆభరణాలు ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి. దేవస్థానం చేయించిన వజ్రకిరీటంతో పాటు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి కుటుంబీకులు స్వామి, అమ్మవార్లకు ఇచ్చిన ఆభరణాలు కూడా ఉన్నాయి. టీటీడీకి తప్ప జిల్లాలోని మిగిలిన ఏ ఆలయాలకు ఈ స్థాయిలో ఆభరణాలు లేవు. అయినా భక్తులు వాటిని దర్శించే భాగ్యం కలగడంలేదు. అభరణాలు వాడకంపై నిర్ణయం తీసుకోలేదు... బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు ఆలయ బంగారు ఆభరణాలు అలంకరిండంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో భద్రతా ఇబ్బందులతో అలంకరించలేదని తెలుస్తోంది. పలువురు పుర పెద్దలు బంగారు నగలు ఉత్సవాల్లో వినియోగించాలని సూచించిన మాట వాస్తవమే. భద్రతాధికారులతో మరోసారి బంగారు అభరణాలపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. -రామిరెడ్డ్డి,ఆలయ ఈవో -
రోల్డ్ గోల్డ్ మొగుడు!
-
ఆభరణానికే అందం...
చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి. నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్‌గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్‌లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు. పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి. షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్‌లు కూడా బాగుంటాయి. పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్‌కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది. అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి. రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు. బ్లౌజ్‌కు తగినవిధంగా...!: హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది. ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్‌ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు. మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు. 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది. 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి. 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది. 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్‌లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు ఎంపికలో ప్రత్యేకత ఉండాలి. మోడల్స్: కావ్య, ప్రియాంజలి ఫొటోలు: శివ మల్లాల కర్టెసీ: మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy@gmail.com -
‘హానెస్ట్’గానే మోసాలు
రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత లభించని బంగారం వ్యాపారి ఆచూకీ వంశపారంపర్య భూముల విక్రయంపైపోలీసుల కన్ను నరసన్నపేట, న్యూస్‌లైన్: పట్టణ ప్రజల, ఖాతాదారుల నమ్మకాన్ని ఆసరా చేసుకుని కోట్లాది రూపాయలు స్వాహా చేసి పరారైన బంగారం వ్యాపారి కేసును పోలీసులు తీవ్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి పాల్పడిన అక్రమాల్లో కొత్త కొత్త అంశాలు తెలుస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత, వంశపారంపర్యంగా సంక్రమించిన భూములను విక్రయించిన వైనాలు వెలుగులోకి వచ్చాయి. ఇల్లు విక్రయిస్తానని డబ్బులు తీసుకుని జీపీఏ ఇచ్చి మోసగించిన సంఘటన కూడా తెలిసింది. నరసన్నపేటలో అదృశ్యమైన బంగారం వ్యాపారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు సాగిస్తున్నారు. వ్యాపారికి తాతల నుంచి సంక్రమించిన సుమారు ఐదెకరాల సాగుభూమి తామరాపల్లి ప్రాంతంలో ఉందని తెలిసింది. ఈ భూమిని తన దుకాణంలో పనిచేస్తున్న ఒక గుమస్తాతో పాటు మరో సామాజిక వర్గానికి చెందిన మరో మిత్రుడు పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ఆ భూముల రిజిస్ట్రేషన్‌పై దృష్టి సారించారు. వ్యాపారి మిత్రుడు, గుమస్తా ఆ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వ్యాపారికి మిత్రుడు సుమారు రూ.12 లక్షల నగదును వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. ఆ భూమి కొనుగోలు ప్రస్తుతం వివాదాస్పదం కానుండడంతో పోలీసులతో పాటు బాధితులుకూడా వ్యాపారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సోంపేటలో గల అత్తవారిల్లు, బరంపురంలోని బంధువుల ఇళ్లకు చేరి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపారికి సంబంధించి పోలీసులకు ఏ విధమైన సమాచారం అందలేదని తెలిసింది. ఒకరికి జీపీఏ.. విక్రయం మరొకరికి... బంగారం వ్యాపారి తన ఇల్లు విక్రయంలో కూడా ‘హానెస్ట్’ మార్కు ప్రదర్శించాడు. తన ఇంటికి సంబంధించి డబ్బు తీసుకుని ఇద్దరికి జీపీఏ ఇచ్చారు. వారిలో ఒక వ్యక్తికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. జీపీఏ మాత్రమే ఉన్న వ్యక్తి స్థానికంగా ఉండకపోవడంతో ఆయనకు ఈ విషయం తెలియలేదు. బంగారం వ్యాపారి ఆభరణాల విక్రయాల్లోనూ ఖాతాదారులను దగా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలపై బంగారం పూత పూయించి బంగారు ఆభరణాలుగా విక్రయించాడని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. రూ.5 కోట్లకు టోకరా అదృశ్యమైన బంగారం వ్యాపారి కోట్లాది రూపాయల్లో టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.2.10 కోట్లు నష్టపోయినట్లు 180 మంది బాధితులు తెలిపారు. కాగా సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోయారని కొందరు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయని బాధితుల సుమారు రూ.కోటిన్నర నష్టపోయి ఉంటారని అంచనా.