breaking news
rihan
-
ఆపరేషన్‌కు ఆర్థిక సాయం అందించిన వైఎస్ జగన్
-
సంపులో పడి బాలుడి మృతి
కడప: అభంశుభం తెలియని పసి బాలుడు ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలోని స్థానిక రవీంద్రనగర్‌లో జరిగింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బాబావలికి సయ్యద్ రిహాన్(3) ఏకైక సంతానం. గురువారం మధ్యాహ్నం బాబావలి భోజనానికని ఇంటికొచ్చేసరికి ఇంట్లో రిహాన్ కనపడలేదు. బాబు ఎక్కడా అని భార్యను ప్రశ్నించి చుట్టూ చూసేసరికి పక్కింట్లోని సంపులో మృతదేహం కనపడింది. దీంతో ఆ బాబు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.