breaking news
review panel
-
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్‌లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్‌వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
యూజీసీపై రివ్యూ ప్యానెల్
న్యూఢిల్లీ: నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలోషిఫ్లు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలోచనపట్ల దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతున్న నేపథ్యంలో దానిపై పూర్తిస్థాయిలో పరిశీలనలు జరిపి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురితో ఓ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అసలు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇస్తున్న పరిశోధన గ్రాంటులను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఆ ప్యానెల్‌కు ఆదేశించింది. నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలో షిప్‌లు చెల్లించొద్దని యూజీసీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పరిశోధక విద్యార్థిలోకంతోపాటు పీజీ విద్యార్థులకు కూడా కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్నారు. గత ఎనిమిది రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మెట్టు దిగొచ్చిన కేంద్రం తమ నిర్ణయాన్ని ఇప్పుడే అమలు చేయొద్దని యూజీసీకి సూచించింది. అయితే, ఇది కంటి తుడుపుచర్యేనని, కేంద్రం తన ప్రకటనను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకున్నప్పుడే తాము ఆందోళన విరమిస్తామంటూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. -
నేతాజీ రహస్య ఫైళ్ల వెల్లడిలో కీలక మలుపు
-
నేతాజీ రహస్య ఫైళ్ల వెల్లడిలో కీలక మలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లలోని వివరాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా అధికారిక రహస్యాల చట్టాన్ని పునఃసమీక్షంచేందుకు సిద్ధమైంది. ప్రధాని కార్యాలయం, రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక పరిశీలన బృందాన్ని ఏర్పాటుచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. నేతాజీ కుటుంబ సభ్యులపై దివంగత ప్రధాని నెహ్రూ నిఘా కొనసాగించారని ఇటీవలే వెలుగులోకి వచ్చిన అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను వెలికితేవాలని పలు సంస్థలు, వ్యక్తులు డిమాండ్ చేస్తుండగా, అవి వెలుగులోకి వస్తే మిత్రదేశాలతో సంబంధాలు చెడిపోతాయని ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇస్తూవచ్చింది. ఈ నేపథ్యంలో ఫైళ్ల పరిశీలన సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక ప్యానల్ ఏర్పాటు ప్రధాన్యం సంతరించుకుంది.