breaking news
refuge Prakash Patil
-
పెద్దలపై ఆప్యాయత చూపండి
వృద్ధుల సమస్యలకు 1090 టోల్‌ఫ్రీ నంబర్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ రాయచూరు/రాయచూరు రూరల్ : జీవన సంద్యా సమయంలో ఉన్న పోషకులను ఆప్యాయతతో పలకరించి వాత్సల్యం చూపుతూ ఆత్మాభిమానంతో జీవించేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ పిలుపు ఇచ్చారు. నగరంలోని ఐఎంఎ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికార సంఘం, న్యాయవాదుల సంఘం, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆధునిక యుగంలో అవిభక్త కుటుంబంలో పెద్దలను గౌరవించే సామరస్యం కొరవడిందన్నారు. యువకులు ఆర్థిక స్వావలంబనకు లీనమై పెంచిన పెద్దలను మరచి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత సంధ్యా సమయంలో ఒంటరితనంతో వృద్ధులు తల్లడిలుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్ 2007 చట్టం మేరకు పెద్దలకు అన్ని సౌకర్యలు కల్పించడం జరుగుతుందన్నార..రాయచూరు జిల్లాలో 38,082 మంది వృద్ధులకు నెలకు రూ.500చొప్పున, 14,042 మందికి రూ.750 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అనంతరం సినీయర్ సిటిజన్లను మంత్రి సన్మానించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి 1090 టోల్‌ఫ్రీ నంబర్ అంతకుముందు మంత్రి పాటిల్ వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సురక్ష సంస్థ సహాయవాణి కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు తమ సమస్యలను 1090 కు ఫోన్ చేసి వివరిస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, సీఈఓ జ్యోత్స్న, ఎస్పీ నాగరాజ్, ఏఎస్పీ పాపయ్య, రిమ్స్ వైద్యాధికారి రమేష్‌బాబు, వసంతకుమార్, శరణప్ప, మహాదేవప్ప, శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారి లక్ష్మికాంతమ్మ, తాలూకా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వీరనగౌడ పాల్గొన్నారు. -
వైద్యకళాశాలల డెరైక్టర్లుగా ‘విమ్స్’ వైద్యులు
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన 6 వైద్య కళాశాలల్లో డెరైక్టర్ పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూలలో బళ్లారిలోని విమ్స్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ వైద్యులు డెరైక్టర్లులుగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని కొప్పళ, గదగ్, గుల్బర్గా, కొడగు, కార్వార, చామరాజనగర్‌లో కొత్తగా ప్రారంభమైన వైద్యకళాశాలల్లోడెరైక్టర్ పోస్టుకు అర్హులైన ప్రముఖ వైద్యులకు గురువారం బెంగుళూరులో రాష్ట్ర వైద్య విద్యాశాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ కార్యాలయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ వైద్యకళాశాలలకు చెందిన 104 మంది ప్రముఖ వైద్యులు దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 36 మందిని అర్హులుగా నిర్ణయించారు. 36 మంది వైద్యుల్లో సీనియారిటీ, ఇంటర్వ్యూల్లో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఆరు కళాశాలకు ఆరుగురిని డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. వీరిలో విమ్స్‌లోని బయోకెమిస్ట్రీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణస్వామి, ఫార్మకాలజీ విభాగ ప్రముఖుడు డాక్టర్ శ్రీనివాసులు, పెతాలజీ విభాగ ప్రముఖ వైద్యుడు డాక్టర్ భరత్‌లు ఉన్నారు. కొడగు విజ్ఞాన వైద్యకీయ సంస్థ ైడె రెక్టర్‌గా డాక్టర్ కృష్ణస్వామి, కొప్పళ వైద్యకళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్, కార్వార వైద్య కళాశాల డెరైక్టర్‌గా డాక్టర్ భరత్ నియమితులైనట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా గదగ్ వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన డాక్టర్ చందు, గుల్బర్గా వైద్య కళాశాల డెరైక్టర్‌గా హుబ్లీ కిమ్స్‌కు చెందిన షాపూర్, చామరాజనగర్ వైద్య కళాశాల ైడె రెక్టర్‌గా డాక్టర్ చంద్రశేఖర్‌లు నియమితులయ్యారు. డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌లకు శుక్రవారం ఉదయం విమ్స్ సిబ్బంది వైద్యులు, అభినందనలు తెలిపారు.