breaking news
rationalyzation
-
ఆక్సిజన్ వృథాను అరికట్టండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వైరస్ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి విషమించి చాలామంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్)కు డిమాండ్ పెరిగింది. చాలా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ దొరక్క బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు వాడకంలో హేతుబద్ధత (రేషనల్) అవసరమని సూచించింది. దేశమంతటా సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజన్ తయారీ యూనిట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7,127 మిలియన్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని గుర్తుచేసింది. గత రెండు రోజులుగా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. త్వరలోనే అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జిల్లా స్థాయి వరకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండ చూడాలని పేర్కొంది. మెడికల్ ఆక్సిజన్‌ను ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారు. -
యూపీ స్కూళ్లపైనే అధిక ప్రభావం
-పాఠశాలల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు -విద్యార్థులు తక్కువుంటే మరో బడిలో విలీనం -ఉపాధ్యాయ పోస్టుల్లో కోత పడే పరిణామం -ఎక్కువున్న చోట సబ్జెక్టు ఉపాధ్యాయులకు అవకాశం రాయవరం(మండపేట) : పాఠశాలల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా ఈ ప్రక్రియకు తెరతీశారు. దీనిపై గతంలో విడుదల చేసిన 55, 61 జీవోలను అనుసరించే కొత్తగా 29 జీవోను విడుదల చేసినట్లుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ చేపట్టేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్/అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఎస్ఎస్ఏ పీవో సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కొనసాగించనున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ జరిగితే ప్రాథమికోన్నత పాఠశాలలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. 19 లోపు విద్యార్థులు ఉండి కిలోమీటరు పరిధిలో పాఠశాల లేకుంటే ఆ స్కూల్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ స్కూల్ ఉంటే అందులో విలీనం చేస్తారు. 6, 7 తరగతుల ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 30 మంది లోపు విద్యార్థులుండి మూడు కిలోమీటర్ల పరిధిలో స్కూల్ లేకపోతే కొనసాగిస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 40 మంది విద్యార్థులుండి మూడు కిలోమీటర్ల పరిధిలో స్కూల్ లేకపోతే కొనసాగిస్తారు. ఉంటే అక్కడే విలీనం చేస్తారు. ఇక ఉన్నత పాఠశాలలకు సంబంధించి 50 మంది లోపు ఉన్న పాఠశాలలను రద్దు చేస్తారు. ఈ ప్రక్రియ ప్రభావం ఎక్కువగా యూపీ స్కూళ్లపై పడనుంది. అధికశాతం యూపీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు దాదాపుగా 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఈ ప్రక్రియ అనివార్యమవుతోంది. ఇది పాఠశాలల విలీనంతో పాటు ఉపాధ్యాయ పోస్టుల్లో కోత పడేందుకు దారి తీస్తోంది. నిబంధనలివీ.. ప్రాథమిక పాఠశాలలో 19 మంది లోపు విద్యార్థులుండి కిలో మీటరు వరకు పాఠశాల లేకుంటే ఒక టీచర్‌ను కొనసాగిస్తారు. 20–60 వరకు విద్యార్థులుంటే ఇద్దరు, 61–80 మంది వరకు ముగ్గురు, 81–130 వరకు ఐదుగురు, 131–160 మంది వరకు ఐదుగురు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్ఎం, 191–230 వరకు విద్యార్థులుంటే 7 గురు ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, 221–250 మంది ఉంటే 9 మంది ఎస్జీటీలు, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టు ఉంటాయి. 130 మంది లోపు విద్యార్థులున్నా ఎల్ఎఫ్ఎల్ పోస్టు ఉంటుంది. కాకుంటే ఎస్జీటీగా పరిగణిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలు(1–7 తరగతులు).. 31 నుంచి 100 మంది దాకా విద్యార్థులకు నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు(గణితం లేదా పీఎస్ పోస్టు ఒకటి, సోషల్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్ పోస్టులు ఒక్కొక్కటి మంజూరు చేస్తారు. 101 నుంచి 140 మంది విద్యార్థులుకు ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు(గణితం లేక పీఎస్, సోషల్, బయొలాజికల్, ఇంగ్లీష్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్). 141–175 మందికి 7 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు(గణితం, పీఎస్, సోషల్, బయొలాజికల్, ఇంగ్లీష్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్). 176 నుంచి 210 వరకు ఎనిమిది పోస్టులు(గణితం, పీఎస్ కలిపి మూడు, సోషల్, బయొలాజికల్, ఇంగ్లీష్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్) పోస్టులు మంజూరు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలు(1–8 తరగతులు).. 41–150 మంది విద్యార్థుల వరకు ఆరు పోస్టులు(గణితం లేక పీఎస్ ఒక పోస్టు, బయొలాజికల్, ఇంగ్లీ,ష్ సోషల్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్). 151 నుంచి 175 వరకు ఏడు పోస్టులు(గణితం, పీఎస్, బయొలాజికల్, ఇంగ్లీష్, సోషల్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్). 176–210 వరకు 8 పోస్టులు(గణితం, పీఎస్ కలిపి మూడు, సోషల్, బయొలాజికల్, ఇంగ్లీష్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్) పోస్టులు ఉంటాయి. ఉన్నత పాఠశాలలు.. 51–240 వరకు విద్యార్థులకు 9 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు(హెచ్ఎం, గణితం, పీఎస్, బయొలాజికల్, ఇంగ్లీష్, ఎల్పీ–టీ, ఎల్పీ–హెచ్). 241–280 వరకు 12 పోస్టులు(హెచ్ఎం, గణితం–2, ఇంగ్లీష్–2, తెలుగు–2, పీఎస్, బయొలాజికల్, సోషల్, హిందీ, పీఈటీ). 281–320 వరకు 13 పోస్టులు(హెచ్ఎం, గణితం–2, ఇంగ్లీష్–2, తెలుగు–2, హిందీ–2, పీఎస్, బయొలాజికల్, సోషల్, పీఈటీ) పోస్టులు మంజూరు చేస్తారు. విద్యార్థులుంటే అదనంగా పోస్టులు.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించేందుకు ఈ ప్రక్రియలో పెద్ద పీట వేశారు. దీంతో ఎక్కువ నమోదు ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ప్రాథమికోన్నత పాఠశాలలో 41 మంది విద్యార్థులుంటే ఆరు పోస్టులు కేటాయించారు. గతంలో ఒకరిద్దరే ఉండేవారు. 140 మంది విద్యార్థులుంటే ఏడు, 400కు పైగా విద్యార్థులుంటే 15 పోస్టులు మంజూరు చేశారు. ఉన్నత పాఠశాలలకు 400 విద్యార్థులుంటే ఒక పీఈటీతో పాటు పీడీ పోస్టు ఇస్తారు. గతంలో ఒక పీఈటీ పోస్టు మాత్రమే ఉంది. 801 మంది విద్యార్థులుంటే రెండు పీఈటీ, ఒక పీడీ పోస్టులు మంజూరవుతాయి. హిందీ సబ్జెక్టులో గతంలో ఒక పోస్టు మాత్రమే ఉండేది. 321 మంది విద్యార్థులుంటే రెండు పోస్టులు ఇస్తారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొలదీ పోస్టుల సంఖ్య పెరుగుతుంది. సక్సెస్ పాఠశాలలో ఎన్ఎస్, సోషల్ సబ్జెక్టులకు గతంలో ఒకరే ఉండగా, ఇప్పుడు రెండేసి పోస్టులు మంజూరు కానున్నాయి.