breaking news
Rahul varma
-
మీసకట్టు అదిరింది.. చెర్రీ లుక్‌పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్ర ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది.ది. ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ‘దోస్తీ’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది.’’ అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. -
భారత్‌లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!
భారతదేశంతో సత్సంబంధాలు ఉంటే మంచిదని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన యంత్రాంగంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మను భారతదేశంలో అమెరికా రాయబారిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా హోంశాఖలో గతంలో సహాయ మంత్రి హోదాలో పనిచేసిన వర్మ.. ప్రస్తుతం స్టెప్టో అండ్ జాన్సన్ అనే న్యాయ సంస్థలో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా వ్యవహరించి, తన పదవీకాలంలో పలు వివాదాలు మూటగట్టుకున్న నాన్సీ పావెల్ రాజీనామా చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. జార్జిటౌన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన రాహుల్ వర్మ.. జాతీయ భద్రతా చట్టం, అంతర్జాతీయ వ్యవహారాలు తదితర విషయాల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందారు. ఇంతకుముందు ఆయన హిల్లరీ క్లింటన్‌తో కలిసి పనిచేశారు. గతంలో అమెరికా ఎగుమతి నియంత్రణలు, ఆర్థిక ఆంక్షలపై కూడా ఆయన కృషి చేశారు. కొంతకాలం పాటు అమెరికా వైమానిక దళంలో కూడా ఎయిర్ ఫోర్స్ జడ్జి అడ్వకేట్‌గా పనిచేశారు.