breaking news
Quiet Quitting
-
క్విట్ వెకేషనింగ్ ట్రెండ్ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?
సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్‌కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్‌ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్‌లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ?
దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించినట్టే..యజమాని ప్రతి విభాగంలో రివాల్వింగ్ చెయిర్ వేసుకుని కూర్చోలేడు కాబట్టి, తన ప్రతినిధిగా బాసును పంపాడు. అలాంటి బాస్‌లతో వేగలేక ఉద్యోగాలకు భారీ ఎత్తున రాజీనామా చేస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభమై 15 రోజులే అవుతున్నా..రానున్న రోజుల్లో ‘రేజ్ అప్లయింగ్’ అంటూ రాజీనామాల సునామీ రాబోతున్నట్లు తెలుస్తోంది. రేజ్ అప్లయింగ్.. 2023లో ఐటీ వర్గాల్లో ఈ పదం తెగ వినపడుతోంది. గతేడాది మూన్‌లైటింగ్,క్వైట్ క్విటింగ్, దిగ్రేట్ రిజిగ్నేషన్ వంటి పదాలు ప్రాచుర్యంలోకి రాగా..ఈ ఏడాది రేజ్ అప్లయింగ్ అనే పదం బాగా వినిపిస్తోంది. ఈ ఏడాది జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో తలెత్తిన సంక్షోభంతో చాలా మంది ఉద్యోగులు కొత్త కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ఒక రంగం నుంచి మరో రంగానికి షిఫ్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా, మునుపెన్నడూ లేనంతగా ఆఫీస్ వర్క్- పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీంతో ఉద్యోగుల పని విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. అలా మార్పులు చోటు చేసుకుంటున్న జాబ్ మార్కెట్ 'క్వైట్ క్విట్టింగ్' అనే కాన్సెప్ట్ గత ఏడాది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. క్వైట్ క్విటింగ్ అంటే నెమ్మదిగా జారుకోవడం అని అర్థం. కార్పొరేట్ పరిభాషలో పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం తమ పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగా ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు, ఫార్చ్యూన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం..క్వైట్ క్విట్టింగ్‌కు కొనసాగింపుగా రేజ్ అప్లయింగ్ అనే పదం బాగా పాపులర్ అవుతుంది. రేజ్ అప్లయింగ్ అంటే మీరు ఓ ఉద్యోగంలో చేరి 4,5 నెలల అవుతుంది. బాస్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అలా ఉంటే వెంటనే రిజైన్ చేసి కొత్త జాబ్‌లో చేరడాన్ని రేజ్ అప్లయింగ్ అంటారు. ఈ రేజ్ అప్లయింగ్ చేస్తున్న జాబ్‌లో అలసిపోవడం, పనికి తగ్గ ప్రతిఫలం లేకపోతే మూకుమ్మడిగా ఉద్యోగులు రిజైన్ చేయడం. పదుల సంఖ్య కొత్త ఉద్యోగాలు అప్లయ్ చేయడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. I’m making almost 30k more a year bc of rage applying 🤣 DO ITTTT pic.twitter.com/qT4Ah9C1s8 — Jas ⚡️ (@Jasminnhere) January 5, 2023 ఫార్చ్యూన్ ప్రకారం, ఉద్యోగి మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ లాటిస్ పీపుల్ గతేడాది ఏప్రిల్ నెలలో సర్వే చేసింది. ఆ సర్వేలో మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారు.. మరో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. మూడు నుంచి ఆరు నెలల పాటు ఉద్యోగంలో ఉన్నవారు.. తమ అంచనాలకు అనుగుణంగా లేదని రాజీనామా చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 59 శాతానికి పెరిగింది. ఈ సందర్భంగా లాటిస్ పీపుల్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ కార్హార్ట్ మాట్లాడుతూ.. జాబ్ మార్కెట్లో ఉద్యోగుల అవసరాల్ని, లేదా అంచనాల్ని అందుకోలేని ఉద్యోగంలో 12 లేదా 18 నెలల పాటు కొనసాగించాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు చెప్పారు.