breaking news
power consumers
-
గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిన గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య గ్రేటర్లో రోజురోజుకూ పెరుగుతోంది. 200 యూనిట్లలోపు వినియోగించే గృహాలకు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో లబ్ధిదారుల సంఖ్య 8,71,841 ఉండగా, నవంబర్ నాటికి 10,52,432కు చేరింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం గత మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చలిగాలులు వీస్తుండటంతో.. గృహజ్యోతి పథకానికి గ్రేటర్లో 21 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిన్నర లక్షల మందికిపైగా అర్హత సాధించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఇప్పటికే ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేశారు. ఫలితంగా నిన్నా మొన్నటి వరకు నెలకు సగటున 200 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వారు.. ప్రస్తుతం 150 యూనిట్ల లోపే వాడుతున్నారు. ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నట్లు డిస్కం అంచనా వేస్తోంది. 9 నెలల్లో కోటికి చేరిన జీరో బిల్లులు.. గృహజ్యోతి పథకం కింద ఒక్కో వినియోగదారుకు నెలకు సగటున రూ.1,150 నుంచి రూ.1,200 వరకు లబ్ధి చేకూరుతోంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. లబ్ధిదారుల పెరుగుదల రేటు హైదరాబాద్ సౌత్‌లో అత్యధికంగా 54.07 శాతం నమోదైంది. మేడ్చల్ సర్కిల్లో అతి తక్కువగా 9.28 శాతం నమోదైంది. గ్రేటర్ మొత్తంగా పరిశీలిస్తే.. 20.71 శాతం నమోదు కావడం గమనార్హం. గత తొమ్మిది మాసాల కాలంలో ఈ పథకం కింద గ్రేటర్లో సుమారు కోటి జీరో బిల్లులు జారీ అయ్యాయి. పథకం అమలుతో ప్రభుత్వంపై నెలకు సగటున రూ.100 కోట్లకుపైగా భారం పడుతోంది. -
కరెంటు చార్జీలు పెరగవు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన డిస్కమ్‌లకు ‘ఏ’ గ్రేడ్: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. డిస్కమ్‌లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్ రూ.10 సీలింగ్ రేట్‌కు కూడా విద్యుత్ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్ రూ.16 సీలింగ్ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్‌లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తోంది. వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఈపీడీసీఎల్ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్ యూనిట్లు విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం. 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు ► ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు ► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా. పాత టారిఫ్‌లే: కె.సంతోషరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్‌ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 2024–25 ఏపీఎస్పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు ► క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు ► ఆర్ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు ► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం. 2024–25 ఏపీసీపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.9090.61 కోట్లు టారిఫ్ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు ఫుల్‌కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు ప్రస్తుత టారిఫ్ వద్ద రెవిన్యూ లోటు– రూ. –3047.26 కోట్లు సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా ► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ మూడు డిస్కమ్‌ల పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్ నేషనల్ అవార్డు 2023 ద్వారా టాప్ స్టేట్ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 400 కేవీ సబ్స్టేషన్లు 7, 220 కేవీ సబ్స్టేషన్లు 23, 132 కేవీ సబ్స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం. -
AP: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా చేర్యలు చేపట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మొత్తం రూ. 10,135 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. చార్జీలు భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని తెలిపారు. -
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
- విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన - 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు - 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 65 పైసల నుంచి 72 పైసలు పెంపు - 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి మంగళవారం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలో.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని తెలుస్తోంది. 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 0.65 పైసల నుంచి 0.72 పైసలు అదనంగా పెరగనుంది. 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 1958 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవాలనే దిశగా డిస్కంలు ప్రతిపాదించినట్టు తెలిసింది. 2016-17 సంవత్సరంలో సగటున యూనిట్‌కు 0.42 పైసలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.