breaking news
poorna chandra rao
-
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది. ‘పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మీడియాతో పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్మరోవైపు పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్‌ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు. -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్‌గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
కండక్టర్ తనయుడు ఆర్టీసీ ఎండీ
బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఎ.కె. ఖాన్ సాక్షి, హైదరాబాద్: ‘మా నాన్న రాధాకృష్ణమూర్తి కండక్టర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి ఆర్టీసీతో అనుబంధం ఉంది. సంస్థకు రుణపడి ఉన్నా. ఇంత కాలానికి నాకు సంస్థ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని ఆర్టీసీ నూతన ఎండీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం ఎ.కె.ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరించాక పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ బాగోగులపై దృష్టి పెడతానని చెప్పారు. ప్రజలకు ఆర్టీసీ మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. పోలీసు ఉద్యోగమే అత్యంత క్లిష్టమైందని, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించడం అంతకంటే క్లిష్టం కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆర్టీసీ ఎండీగా ఏడాదిన్నర కాలం పనిచేయడం సంతోషంగా ఉందని ఎ.కె.ఖాన్ అన్నారు. ఆర్టీసీ ఎండీగా పూర్ణచంద్రరావుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత అనినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డీజీగా ఎ.కె. ఖాన్ బాధ్యతలు చేపట్టారు.