breaking news
poorna chandra
-
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్‌లో న్యూస్‌రీడర్, యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
అలేఖ్య.. లవ్ చీటర్ !
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడకు చెందిన పూర్ణచందర్ ప్రేమ పేరుతో తనను వంచించాడని, న్యాయం చేయాలని అతడి ఇంటిముందు బైఠాయించి నానారభస చేసిన అలేఖ్యరెడ్డి అమాయకురాలేమీ కాదు.. ఆమె కూడా ఓ పెద్ద మోసగత్తె అనే విషయం ఆలస్యంగా తెలిసింది. బీటెక్ స్టూడెంట్‌నని, రెవెన్యూ ఇన్స్పెక్టర్నని రకరకాల హోదాలు చెప్పి యువకులతో పరిచయాలు పెంచుకోవడం.. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వలపుల వల వేయడం.. తర్వాత తనను మోసం చేశాడంటూ కేసులు పెట్టి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం.. ఇదీ ఆమె అసలు నైజం! అలేఖ్య వలలో చిక్కుకుని ఆమె భర్తతోపాటు నలుగురు యువకులు కేసులపాలు కాగా.. పూర్ణచందర్ అయిదో వ్యక్తి. అతడు తనను మోసం చేశాడంటూ ఫొటోలు చూపించి స్థానికులను, పోలీసులను, మీడియాను సైతం తప్పుదారిపట్టించింది. పూర్ణచందర్ కూడా అలేఖ్య దారిలోనే వెళ్లి ఆమె వలలో చిక్కుకున్నాడు. పూర్ణచందర్-అలేఖ్య వ్యవహారంపై ‘ప్రేమాయకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనం హైదరాబాద్ టాబ్లాయిడ్లోనూ ప్రచురితమైంది. ఈ కథనాన్ని చదివిన సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి స్పందించి అలేఖ్య అసలు చరిత్రను బయటపెట్టారు. వలపుల వలలో చిక్కితే అంతే.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన అలేఖ్యరెడ్డి ఉరఫ్ బుజ్జీ ఉరఫ్ హేమ పసితనంలోనే తల్లి మరణించడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. అలేఖ్య విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వెళ్లి ఉమెన్ ్స హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఈక్రమంలోనే రవీందర్ అనే వ్యక్తిని వివాహమాడింది. కొంతకాలానికి రవీందర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులపై సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్లో వేధింపుల కేసుపెట్టింది. క్రైం నంబర్ 14/13 ప్రకారం 420, 498(ఎ) 3అండ్4/డీపీ యాక్ట్ కేసులు బాధితులపై నమోదయ్యాయి. * చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 385/12 ప్రకారం.. జగ దీశ్వర్ అనేవ్యక్తిపై చీటింగ్, కిడ్నాప్ 324,509 కింద కేసులు పె ట్టింది. ఇక్కడా బాధితుడు బోరుమన్నాడు. * మరో వ్యక్తిపై క్రైం నంబర్ 62/13 ప్రకారం 342, 366, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్లతో కేసుపెట్టింది. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న పూర్ణచందర్ ఆమె వలలో చిక్కాడు. ప్రేమపేరిట తనను వంచించాడని, కిడ్నాప్‌చేసి వేధించాడని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 421/13 ప్రకారం 420, 323, 506 కేసులు పెట్టింది. దీంతో పూర్ణచందర్‌తోపాటు అతడి తల్లిదండ్రులు రాధ, రాంచందర్ రిమాండ్ కాలాన్ని జైల్లో గడిపారు. ఇటీవలే విడుదలైన వీరు వేములవాడకు వచ్చారు. ఇది తెలుసుకున్న అలేఖ్యరెడ్డి శనివారం రాత్రి వేములవాడకు వచ్చి అతడి ఇంటిముందు బైఠాయించి కొ త్త డ్రామాకు తెరలేపింది.ఈమె రాకతో పరు వుపోతుందని భావించిన వీరు ఇంటికి తా ళంవేసి వెళ్లిపోయారు. దీంతో అలేఖ్య ఆరోపణలు నిజమేనని స్థానికులు నమ్మేశారు. ఆమె ఓ చీటర్ సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి సోమవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. సరూర్‌నగర్ ఆర్ఐగా చెప్పుకున్న అలేఖ్యరెడ్డి పెద్ద మోసగత్తె అని ఆమె చెప్పారు. గతంలో ఉప్పల్ ఆర్ఐగా చెప్పుకొని స్థానికులకు ల్యాండ్ పోజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించే పేరిట పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. జంటనగరాల్లో మహిళా ఆర్ఐలున్న రెవెన్యూ కార్యాలయాన్ని గుర్తించి.. అందుకనుగుణంగా తనపేరును మార్చుకుని ఆ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గతంలో గుర్తించారని వెల్లడించారు. పూర్ణచందర్ సైతం.. వేములవాడకే చెందిన ఓ యువతిని పూర్ణచందర్ మూడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఆమెను వదిలేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో అనుకోకుండా అలేఖ్యరెడ్డితో పరిచయం ఏర్పడింది. తనను సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకున్న అలేఖ్య... తన తల్లి తహశీల్దార్‌గా మరణించిందని, ఆమె స్థానంలో తనకు కారుణ్య నియామకాల్లో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం దక్కిందని చెప్పింది. తన జీతంతోపాటు తల్లి పింఛన్, ఇంటి కిరాయిలు కలిపి నెలకు రూ.లక్ష ఆదాయం ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ నమ్మిన పూర్ణచందర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంకేముంది ఆమె పాచిక పారింది. మూడు నెలలు తిరక్కుండానే ఇలా అడ్డంగా బుక్కైపోయాడు.