breaking news
poole
-
‘ఫూల్’ను ‘పూల్’లా అనుకోవడం వల్లే...
ముంబై: ‘ఫూల్ (పువ్వులు) పడిపోయాయి’ అన్న మాటలను ‘పూల్(వంతెన) పడిపోయింది’ అన్నట్లుగా అర్థం చేసుకోవడంతో ఎల్ఫిన్స్టన్ రైల్వే స్టేషన్‌లోని వంతెనపై పెను ప్రమాదం చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడ్డ ఓ యువతి వెల్లడించింది. బ్రిడ్జి పక్కన ఉన్న ఓ విక్రయదారుడు పూలు పడిపోయాయని ఏడుస్తుండటాన్ని ప్రయాణికులు తప్పుగా అర్థం చేసుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొని తీవ్ర తొక్కిసలాట జరిగిందని చెప్పింది. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నియమించిన విచారణ కమిటీకి బాధితురాలు ఈ మేరకు వెల్లడించింది. ఇటీవల ముంబైలోని ఎల్ఫిన్స్టన్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి 23 మంది మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని కూడా ఫూల్‌ను పూల్‌గా అనుకోవడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపింది. -
దార్శనికుడు జ్యోతిరావుఫూలే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : సమాజాన్ని ప్రభావితం చేసేలా జ్యోతిరావుఫూలే అనుసరించిన విధానాలు ఆయనను దార్శనికునిగా నిలిపాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జ్యోతిరావుఫూలే 191వ జయంతిని మంగళవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ఫూలే విగ్రహానికి కన్నబాబు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ విప్లవాత్మకమైన ఆలోచనలతో అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించాలన్న లక్ష్యంతో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ప్రధానంగా మహిళలు, రైతులు, కార్మికవర్గాల సమస్యలపై ఆయన ఎంతగానో ఉద్యమించారన్నారు. మహిళా విద్య కోసం ఆయన పాటుపడ్డారన్నారు. సరికొత్త ఆలోచనలతో సమాజాన్ని ప్రభావితం చేసి ఇప్పుడు వెనుకబడిన వర్గాలతోపాటు, ఇతర వర్గాల హృదయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నబాబుతోపాటు వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లిరాజబాబు మాజీ ఎంపీ గుబ్బల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, పార్టీ మైనార్టీ, వాణిజ్యవిభాగం కన్వీనర్లు అక్బర్ అజామ్, పెద్దిరత్నాజీ, పార్టీ నాయకులు ముత్యాల సతీష్, కడియాల చినబాబు, చింతపల్లి చంద్రశేఖర్, పుప్పాల బాబి, గోపిశెట్టి బాబ్జి, రొంగలి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, రమణాతిమురళి, గంజా సత్తిబాబు, పోరాడ దుర్గాప్రసాద్, గోపిశెట్టి బాబ్జి, నక్కా వీరన్న పాల్గొన్నారు. పోరాటాలకు స్ఫూర్తి ఫూలే – మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భానుగుడి (కాకినాడ): పొగొట్టుకున్న హక్కులు పోరాడితేగాని రావన్న స్ఫూర్తిని నింపిన మహనీయుడు జ్యోతిరావుఫూలే అని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ భవన్లో బీసీ వెల్ఫేర్‌శాఖ ఏర్పాటు చేసిన పూలే 191 జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత శాంతిభవన్ సెంటర్లో ఫూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆర్ఎస్ మాట్లాడుతూ ఫూలే ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. శూద్రులకు విద్యలేనందున జ్ఞానం లేదని, జ్ఞానం లేనందున నైతికత లేదని, నైతికత లేనందున ఐక్యమత్యం లేదని, ఐక్యమత్యం లేనందున శక్తి లేదని ఈ కారణాల చేతనే శూద్రులు చరిత్రలో అణచివేతకు గురయ్యారని, వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు. ఫూలేకు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేదిక నుంచి డిమాండ్ చేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్‌లో గొప్ప నాయకుల జన్మదినోత్సవాలు ఉన్నాయని, వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు దిక్సూచిగా మందుకు సాగాలన్నారు. జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు మాట్లాడుతూ పూలే పేదలకోసం పాటుపడి చరిత్రలో నిలిచారని, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పలు పథకాల్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కెవీ.సత్యనారాయణరెడ్డి, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, బీసీ వెల్ఫేర్ డీడీ చినబాబు, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, ఆర్డీవో రఘుబాబు పాల్గొన్నారు. -
సామాజిక విప్లవకారుడు పూలే
బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు ఏఎన్‌యూ: విశ్వమేధావి పూలే అని బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా పూలే వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పీడిత జాతుల విముక్తి ప్రదాత పూలే అని చెప్పారు. ఆధునిక భారతదేశ చరిత్రలో కులవ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి కులనిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. పూలే సిద్ధాంతాలపై ఏఎన్‌యూ అధ్యయన కేంద్రంలో సమగ్రంగా పరిశోధనలు చేయాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ పూలేపై ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు, రచనలను ఏఎన్‌యూ పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తెలుగులో ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమానికి పూలే అధ్యయన కేంద్రం డెరైక్టర్ ఆచార్య నూర్‌బాషా అబ్దుల్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.ప్రసాద్, భావనారుషి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సొషల్ సైన్స్ డీన్ తొలగింపు అన్యాయం యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్‌గా నియమితులైన చంద్రకుమార్‌ను రెండునెలల్లో తొలగిం చడం అన్యాయమని ఏఎన్‌యూ ఎస్పీఎస్‌ఎఫ్ (గిరిజన విద్యార్థి సమాఖ్య) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గిరిజనుడైన చంద్రకుమార్‌ను అకారణంగా పదోన్నతి తొలగించడం అప్రజాస్వామికమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఎస్టీఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసనాయక్, డి.అంకన్న ఉన్నారు. నేడు మిణుగురులు సినిమా ప్రదర్శన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం మిణుగురులు సినిమా ప్రదర్శన జరుగుతుందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు డైక్మెన్ ఆడిటోరియంలో సినిమా ప్రదర్శన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.