breaking news
pintu
-
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడియా నటుడు పింటు నందా(45) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మొదట భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చదవండి: రితికాపై మీడియా ఫైర్, క్షమాపణలు కోరిన హీరోయిన్! కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. పింటు నందా మృతితో ఒడియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. పింటు నందా ఒడియా సినీ పరిశ్రమలో హీరోగా, ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు. -
సోదరికి టాయిలెట్ గిప్ట్ గా ఇచ్చాడు..
రాంచీ: రక్షాబంధన్ రోజున తన సోదరికి ఓ అన్న అరుదైన కానుక ఇచ్చాడు. సాధారణంగా రాఖీ కడితే సోదరులు... అక్కా లేదా చెల్లెళ్లకు చీర లేక నగదు రూపంలో బహుమతి ఇస్తుంటారు. అయితే జార్ఖండ్‌లోని రాంగఢ్‌కు చెందిన పింటూ అనే యువకుడు మాత్రం తన సోదరికి మరుగుదొడ్డిని నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపకల్పన చేసిన స్వచ్ఛ భారత్ ద్వారా స్ఫూర్తి పొందిన అతడు ఈ పనికి పూనుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లడం అనేది ఎంతో ఇబ్బందో తనకు తెలుసునని, అది ఆరోగ్యానికి మంచిది కాదని పింటూ పేర్కొన్నాడు. దీంతో మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. 'నేను రక్షా బంధన్ సందర్భంగా నా సోదరికి టాయిలెట్ బహుమతిగా అందించాను. ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తే బాగుంటుంది' అని సూచన చేశాడు. ఈ నిర్ణయంతో తన సోదరి కూడా సంతోషంగా ఉందని పింటూ తెలిపాడు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందన్నట్లు పింటూ ఆలోచనతో ...ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే.