breaking news
pick-up vehicles
-
మస్క్ సైబర్ ట్రక్ దూకుడు: యాపిల్ ఎనలిస్ట్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు
Cybertruck deliveries ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ టెస్లాకు సంబంధించి తాజా విశ్లేషణ ఒకటి వైరల్‌గా మారింది. టెస్లాకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణ సైబర్‌ట్రక్ 2024లో దాదాపు 120,000 డెలివరీలన చేయనుంది. అంతేకాదు 2025 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని టాప్ ఆపిల్ విశ్లేషకుడు పేర్కొన్నారు. మింగ్-చి కువో టెక్ దిగ్గజం ఆపిల్‌ను కవర్ చేసే టాప్ ఎనలిస్టు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బహుశా 2030 నాటికి ఆల్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు సైబర్‌ట్రక్ మార్కెట్లో గొప్ప పోటీ ఇవ్వనుంది. సైబర్‌ట్రక్ 2024లో లక్షనుంచి లక్షా 20వేల యూనిట్ల డెలివరీలను నమోదు చేయనుంది. అదే 2025లో 240,000 నుండి 260,000 డెలివరీ చేస్తుందని TF ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కువో నివేదించారు. ఈ సంవత్సరం సైబర్‌ట్రక్ షిప్మెంట్లు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అయితే కేవలం 100-200 యూనిట్లు మాత్రమే నని చెప్పారు. ప్రస్తుత రవాణా అంచనాలు వరుసగా ఈ ఏడాదిలో 100-200, 2024లో ఒక లక్ష నుంచి , లక్షా 20వేలు, అలాగే 2025లో 2 లక్షల 40 వేలనుంచి 2 లక్షల 60 వేల యూనిట్లుగా ఉంటాయని కువో ఒక పోస్ట్‌లో రాశారు. సైబర్ట్రక్కు కొనసాగింపుగా సైబర్ ట్రక్-2 వచ్చే అవకాశం ఉందన్నారు. సైబర్‌ట్రక్ వినూత్న డిజైన్లు (ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ వంటివి) 2030 వరకు దాని పోటీ ప్రయోజనాన్ని కొనసాగిస్తుందని, అలాగే సైబర్‌ట్రక్ 2 2030 వరకు షిప్పింగ్‌ను ప్రారంభించని కూడా కువా చెప్పారు సైబర్‌ట్రక్ 2 ప్రారంభానికి ముందు, అప్‌గ్రేడెడ్, సవరించిన స్పెసిఫికేషన్లతో సైబర్‌ట్రక్ వెర్షన్లు ఉంటాయని అంచనావేశారు. రాబోయే సంవత్సరాల్లో టెస్లా రాబడి , లాభాల వృద్ధికి సైబర్‌ట్రక్ ప్రధాన దోహదకారి అవుతుందని కువో పేర్కొన్నారు. Saw the @cybertruck. Looks like a Master Candidate. 📐👽🔥🤯 pic.twitter.com/yiN3KRj3y5 — Tesla Owners Silicon Valley (@teslaownersSV) October 10, 2023 -
టాటా మోటార్స్ పికప్ వాహనాలు
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నవంబర్ 23 నుంచి 25 దాకా జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా 2016 ఎగ్జిబిషన్లో టాటా మోటార్స్ కొత్త పికప్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. కోళ్ల రవాణాకు ఉపయోగపడేలా రూపొందించిన 207 ఆర్ ఎక్స్ కామన్ రెరుుల్ బీఎస్4, జెనాన్, 407, 709 మొదలైన మోడల్స్ వీటిలో ఉన్నారుు.