breaking news
Petro Marketing Company
-
చమురు షేర్లకు ధరల రెక్కలు
అంతర్జాతీయ మార్కెట్లలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిలో రష్యా, ఒపెక్ కోతలు విధించడం సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థల రికవరీకి దోహదపడగలవన్న అంచనాలు సైతం దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.సోమవారం లండన్ మార్కెట్లో 7 శాతం జంప్‌చేసిన బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా మరికొంత పుంజుకుని 35 డాలర్లకు చేరింది. ఇక న్యూయార్క్ మార్కెట్లోనూ ముందురోజు 8 శాతం ఎగసిన నైమెక్స్ బ్యారల్ 32.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక, తదితర కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.చమురు ఉత్పాదక కౌంటర్లపై సబ్సిడీ భారం తగ్గనుండగా..పెట్రో మార్కెటింగ్ షేర్లు సైతం కళకళలాడుతున్నాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలపడే వీలుండటం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 78కు చేరింది. ఈ బాటలో ఆయిల్ ఇండియా 6.5 శాతం ఎగసి రూ. 84ను తాకగా.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5.2 శాతం లాభంతో రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇంద్రప్రస్థ గ్యాస్ 2.3 శాతం పుంజుకుని రూ. 456 వద్ద కదులుతోంది. తొలుత ఈ షేరు 460 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 1.5 శాతం బలపడి రూ. 183 వద్ద, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.5 శాతం పెరిగి రూ. 73 వద్ద, హెచ్‌పీసీఎల్ 1 శాతం పుంజుకుని రూ. 175 వద్ద, బీపీసీఎల్ 1 శాతం లాభంతో రూ. 297 వద్ద ట్రేడవుతున్నాయి.ఇంట్రాడేలో బీపీసీఎల్ 304ను, హెచ్‌పీసీఎల్ రూ. 180నూ అధిగమించాయి. -
ప్రభుత్వ పెట్రో షేర్ల పరుగులు
► రెండు రోజుల క్షీణతకు మార్కెట్ బ్రేక్ ► సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు అప్ ముంబై: ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు పరుగులు తీయడంతో పాటు ఇతర రంగాల ప్రభుత్వ రంగ షేర్లు, మెటల్ షేర్లు పెరగడంతో మార్కెట్లో రెండురోజుల క్షీణతకు బ్రేక్‌పడింది. గత రెండు రోజుల్లో 337 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 88 పాయింట్లు (0.27 శాతం) పెరిగి 32,325 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్ల (0.53 శాతం) పెరుగుదలతో 10,066 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్ మొత్తంమీద 15.53 పాయింట్లు, నిఫ్టీ 51,90 పాయింట్ల చొప్పున పెరిగాయి. సూచీలు లాభపడటం వరుసగా ఇది ఐదోవారం. యూరప్‌లో మార్కెట్లు పటిష్టంగా ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్చేసుకున్నారని, దాంతో మార్కెట్ పెరుగుదల సాధ్యపడిందని విశ్లేషకులు చెప్పారు. కొన్ని బ్లూచిప్ కంపెనీల ఫలితాలు...అంచనాల్ని మించాయని, దాంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్లు వారు తెలిపారు. ఐఓసీ 8 శాతం అప్... ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్ కంపెనీ ఐఓసీ క్రితం రోజు ఫలితలు ప్రకటించిన తర్వాత 5 శాతం వరకూ పెరగ్గా, తాజాగా మరో 8 శాతం ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ. 418 వద్ద ముగిసింది. మరో పెట్రో కంపెనీ బీపీసీఎల్ 5 శాతంపైగా ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 518 వద్ద క్లోజయ్యింది. ఈ రెండు కంపెనీలూ నిఫ్టీ–50లో భాగమైనందున, సెన్సెక్స్‌కంటే నిఫ్టీ అధికశాతం పెరిగింది. శుక్రవారం ఫలితాలు వెల్లడించిన ఇంకో పెట్రో కంపెనీ హెచ్‌పీసీఎల్ పెద్ద ఎత్తున 10 శాతం వరకూ ర్యాలీ జరిపి నూతన గరిష్టస్థాయి రూ. 433 వద్ద క్లోజయ్యింది. ఫార్మా డౌన్... ఫార్మా షేర్లలో వరుసగా మూడోరోజు డౌన్‌ట్రెండ్ కొనసాగింది. డాక్టర్ రెడ్డీస్ లాబ్ 3.7 శాతం క్షీణించి 52 వారాల కనిష్టస్థాయి రూ. 2,239 వద్ద ముగిసింది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, లుపిన్లు కూడా క్షీణతతో ముగిసాయి.