breaking news
parliament hall
-
పార్లమెంట్ హాల్లో అడుగుపెడతాననుకోలేదు
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హన్మకొండ: ‘పార్లమెంట్ దగ్గరికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినా కిలోమీటర్ దూరం నుంచి పార్లమెంట్‌ను చూశా. అలాంటిది ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం కలిగింది.’ అని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుడినైన తనకు కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ప్రజలు ఎంపీని చేశారన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు నిధులు తెస్తానన్నారు. -
మా రాజీనామాలతో ప్రభుత్వం పడిపోదు: హర్షకుమార్
తమ రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోదని అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జి.వి.హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. రాజీనామాల విషయమై పార్లమెంట్ హాల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందుగా రాజీనామాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు సూచించారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే అందరం కలసి రాజీనామాలు చేద్దామని సీఎం కిరణ్ తమతో పేర్కొన్న విషయాన్ని హర్షకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.