breaking news
PALASA railway station
-
మంటగలిసిన మానవత్వం
శ్రీకాకుళం, కాశీబుగ్గ : మానవత్వం మంటగలిసే ఘటన పలాస రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది 15 గంటలు దాటినా ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం నుంచి మృతదేహం పడి ఉన్నా రైల్వే ఉద్యోగులు గానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు గానీ కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు రాత్రి 9 గంటల సమయంలో కొందరు ప్రయాణికులు స్పందించి రైల్వే పోలీసులకు, మాస్టర్‌కు సమాచారం అందించారు. అయినా వారు కూడా స్పందించకుండా అలాగే వదిలేశారు. -
మంటగలిసిన మానవత్వం
కాశీబుగ్గ :మానవత్వం మంటగలిసింది. కళ్ల ముందే ఓ వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నా పట్టించుకోకుండా ఎవరిదారిన వారే వెళ్లిపోయిన సంఘటన బుధవారం పలాస రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. విజయనగరం పట్టణంలోని వై.ఎస్.ఆర్.నగర్‌కు చెందిన గొట్టుపల్లి వెంకటరావు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పలాస రైల్వేష్టేన్‌లో టికెట్ తీసుకుని వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ రక్షించాలని తోటి ప్రయాణికులను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. దీంతో కొద్దిసేపటి తర్వాత వెంకటరావు మృతి చెందాడు. ప్రయాణికులు సకాలంలో స్పందించి కనీసం సపర్యలు చేసినా ప్రాణాలు దక్కేవని అక్కడే ఉన్న ఓ దివ్యాంగ యాచకుడు వాపోయాడు. వందలాది మంది ప్రయాణికులు చూస్తూ వెళ్లిపోయారే తప్ప వైద్యసేవల కోసం ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత జీఆర్పీ పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ దర్యాప్తు అధికారి జి.అరుణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. -
పలాస రైల్వే స్టేషన్లో సమస్యల కూత
రైల్వే అధికారుల అలక్ష్యం, పాలకులు పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. జీడి ఎగుమతుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన పలాస రైల్వేస్టేషన్లో నిత్యం సమస్యల కూత వినిపిస్తోంది. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, టిక్కెట్ కౌంటర్లు ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సౌకర్యాలు కల్పించకుంటే డబుల్‌డెక్కర్ రైలు సదుపాయం ఎండమావిగానే మిగులుతుందన్న అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. పలాస: ఈస్టుకోస్టు రైల్వే, కుర్ధా డివిజన్లోని చిట్టచివరిదైన పలాస రైల్వేస్టేషన్లో సమస్యల కూత వినిపిస్తోంది. అభివృద్ధిపై అధికారులు అలక్ష్యం చేస్తున్నారు. స్టేషన్ మీదుగా సుమారు 30 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నా, ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. ఫలితం నిత్యం కష్టాలు తప్పడం లేదు. తాజాగా పలాస నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు సదుపాయం కల్పిస్తున్నట్టు ైరె ల్వే అధికారులు ప్రకటించారు. అయితే, అందుకు తగ్గట్టుగా ఈ స్టేషన్లో తగిన సదుపాయాలు మాత్రం కల్పించలేదు. ప్రధానంగా రైల్వే వాషింగ్ యార్డు లేదు. గత ంలో ఉన్న లోకోషెడ్ కూడా మూలకు చేరింది. పలాస స్టేషన్లో రైలును నిలపాలంటే రైళ్లు కడగడం నుంచి కండిషన్ వరకు సరిచూడడం, రైలు పెట్టెల్లో నీటిని నింపడం తదితర నిర్వహణ పనులు చేయాలి. ఇవి నెరవేరాలంటే ముందుగా పలాసలో వాషింగ్ యార్డుతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలి. రైలు తనిఖీ కోసం రిపేర్ లైన్ (ఫిట్నె స్ గేజ్) వంటివి విధిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే పూర్తిస్థాయిలో రైళ్ల నిర్వహణ, మరమ్మతుల పనులకు అంతరాయం తప్పదు. పలాస స్టేషన్లో ఇప్పటికే సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతోపాటు రిపేర్‌లైన్, వాషింగ్ యార్డు లేదు. ఈ పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ రైలు పలాస వరకు ముందుగా నడిపించి ఆ తరువాత భువనేశ్వర్‌కు తరలిస్తారన్న అనుమానం ప్రయాణికుల్లో తలెత్తుతోంది. డబుల్ డెక్కర్ ఆశ చిగురించేనా...! స్టేషన్లో ప్లాట్‌ఫారాలు మూడే ఉన్నాయి. అవి కూడా రైల్వే టికె ట్ బుకింగ్ కౌంటర్‌కు ఆనించి లేవు. షెల్టర్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఇన్ని సమస్యల నడుమ పలాస రైల్వే స్టేషన్ నుంచి విశాఖ మీదుగా విజయవాడకు డబుల్ డెక్కర సదుపాయం కల్పిస్తామన్న అధికారుల ప్రకటనలతో ప్రయాణికుల్లో ఆశలు చిగురిస్తున్నా... సమస్యల నడుమ ఇది సాధ్యమేనా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో కూడా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పలాస వరకు ముందుగా పొడిగించి ఆ తర్వాత అంచెలంచెలుగా భువనేశ్వర్ వరకు పొడిగించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఏటా రైల్వే బడ్జెట్లో ప్రతిపాదనల కూత వినిపిస్తున్నా చివరికి మొండిచేయి చూపిస్తున్న రైల్వేశాఖ ఈ సారైనా కొత్త రైలు మంజూరు చేస్తే జిల్లా వాసులకు ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రద్దీగా ఉన్న రైళ్లే గతి... శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, తిలారు (కోటబొమ్మాళి), ఆమదాలవలస, పొందూరు వంటి ప్రధాన స్టేషన్ల నుంచి వేలాది మంది సికింద్రాబాద్, చెన్నై, అహ్మదాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఒడిశా నుంచి రైళ్లు నడుస్తుండడంతో జిల్లాకు వచ్చేసరికి నిండిపోతున్నాయి. నిత్యం రద్దీతోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో సికింద్రాబాదు నుంచి పలాస వరకు నడిచిన ‘విశాఖ’ ఎక్స్‌ప్రెస్ జిల్లా వాసులకు అనువుగా ఉండేది. దాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌కు తరలించడం తో యథావిధిగా కష్టాలు ప్రారంభంమయ్యా యి. గత ఏడాది రైల్వేబడ్జెట్‌లో పలాస నుంచి విజయవాడకు పాస్ట్ పాసిం జర్ రైలు ప్రస్తావన వచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. విశాఖపట్నం నుంచి పలాస వరకు నడుస్తున్న ఈఎంయూను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలన్న ప్రతిపాదనదీ అదే పరిస్థితి. తాజాగా ఈస్ట్‌కోస్ట్ డివిజన్ ఐఆర్‌టీటీసీకి కొత్త రైళ్ల ప్రతిపాదన నివేదించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్ రైళ్లను సైతం పలాస, విశాఖపట్నం మీదుగా వారానికి రెండు రోజులు నడిపించి, రిజర్వేషన్ కోటా పెంచి తేనే ప్రయోజనం చేకూరుతుందన్న వాదన వినిపిస్తోంది. ముం దుగా ప్రయాణికులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.