breaking news
oral communication
-
Oral Vaccine: ప్రయోగాలకు ఐసీఎంఆర్ రెడీ!
కొవిడ్-19 జబ్బు కోసం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ను ఇదివరకే భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం అది క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నోటి ద్వారా అందించే టీకాను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది ఐసీఎంఆర్. . కోల్కతా: ఈ మేరకు ఒక ప్రతిపాదనను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి పంపినట్లు భారత వైద్య పరిశోధన మండలి-కలరా అండ్ ఎంటెరిక్ సీసీజెస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఒక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని ఐసీఎంఆర్–ఎన్ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా వెల్లడించారు. ప్రయోగానుమతి లభించి, నిధుల లభ్యత కాగానే పని ఆరంభిస్తామన్నారు. ఒక్కసారి టీకా తయారయ్యాక జంతువులపై ప్రయోగిస్తారని తెలిపారు. మాములు టీకా తయారీలో ఉన్నట్లే ఇందులో అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాబ్లో ఓరల్ వ్యాక్సిన్ తయారీకి కనీసం 5–6 సంవత్సరాలు పడతుందని ఆమె వివరించారు. -
ఓరల్ కమ్యూనికేషన్లో సర్టిఫికెట్ కోర్సు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఓరల్ కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్’ అంశంపై 10 రోజుల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13 ఆఖరుతేదీ. 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వివరాలకు 040-27098453లో సంప్రదించవచ్చు.