breaking news
One day world cup (2015)
-
కోహ్లితో నాడు వాగ్వాదం.. పాక్ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు! కొడుకా అంటూ..
Virat Kohli: వన్డే వరల్డ్‌కప్ 2015.. ఫిబ్రవరి 15.. అడిలైడ్ ఓవల్ మైదానంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎప్పటిలాగే టీమిండియాదే పైచేయి.. ఈ విజయంలో ముఖ్యపాత్ర వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిది! రన్‌మెషీన్ కోహ్లి దెబ్బకు.. దాయాది శిబిరంలో పేసర్ సొహైల్ ఖాన్ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోని, అజింక్య రహానే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కోహ్లి అద్భుత సెంచరీకి తోడు, రైనా 74 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు స్కోరు చేసింది టీమిండియా. భారత బౌలర్ల విజృంభణతో చతికిలపడ్డ పాకిస్తాన్ 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో చిత్తైంది. కోహ్లి- సొహైల్ వాగ్వాదం అయితే, నాటి భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- సొహైల్ ఖాన్ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్న సొహైల్ ఖాన్.. కోహ్లితో గొడవ సందర్భంగా అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. బిడ్డా నువ్వు అండర్ 19లో ఆడుతున్నపుడే నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సొహైల్.. ‘‘నేను బ్యాటింగ్‌కి వెళ్లినపుడు.. విరాట్ కోహ్లి నా దగ్గరకొచ్చి.. కొత్తగా వచ్చావు.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు నేను.. ‘‘కొడుకా(బిడ్డా).. నువ్వు అండర్ 19 క్రికెట్ ఆడుతున్నపుడు.. మీ బాపు (తనను తాను ఉద్దేశించి) టెస్టు క్రికెటర్ అని చెప్పాను’’ అన్నాడు. ఇక 2006 నుంచి తాను పాకిస్తాన్‌కు ఆడుతున్నానన్న సొహైల్.. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన విషయాన్ని చెప్పానన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సొహైల్‌కు అనూహ్యంగా నాటి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అంత గొప్పగా ఏం లేదు ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లోనూ కోహ్లి ఒంటిచేత్తో పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే, సొహైల్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిందేమీ మరీ అంత చెప్పుకోదగ్గ షాట్ కాదు. తనకు బౌలర్ ఇచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకున్నాడు అంతే’’ అని పేర్కొన్నాడు. కింగ్ ఫ్యాన్స్ ఫైర్ కాగా సొహైల్ ఖాన్ 2008 జనవరిలో జింబాబ్వేతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో టెస్టుల్లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక కోహ్లి శ్రీలకంతో వన్డేలో 2008 ఆగష్టులో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాడు. 2011లో భారత్ తరఫున వెస్టిండీస్‌తో సిరీస్‌లో మొదటి టెస్టు ఆడాడు. ఇక సొహైల్ తాజా ఇంటర్వ్యూ నేపథ్యంలో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ఎప్పుడొచ్చామని కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం. వయసు రాగానే సరిపోదు.. అందుకు తగ్గట్లు సంస్కారంగా ఉండటం నేర్చుకోవాలి. అవేవో గొప్ప మాటలు అయినట్లు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నావా’’అని 38 ఏళ్ల సొహైల్‌కు చురకలు అంటిస్తున్నారు. కోహ్లి ముందు నువ్వు ఏమాత్రం పనికిరావంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! WC 2023: ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్‌ల ఫలితాలు తేలితేనే -
గాయంతోనే ఆడాను!
న్యూఢిల్లీ: ధోని నాయకత్వంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి 2015 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరగలిగింది. సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులతో ఓడి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ టోర్నీ ఆరంభంనుంచే మోకాలి గాయంతో బాధపడుతూ మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన షమీ సెమీస్‌లో ఆడటం తన వల్ల కాదన్నా... ధోని భరోసా ఇవ్వడంతో ఆడాల్సి వచ్చింది. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో జరిగిన ఇన్‌స్టగ్రామ్ సంభాషణలో అతను ఈ విషయం చెప్పాడు. ‘సెమీస్‌కు ముందు ఇక నా వల్ల కాదంటూ జట్టు సహచరులతో చెప్పేశాను. నొప్పి చాలా ఉందని చెప్పాను కానీ టీమ్ మేనేజ్మెంట్ గాయం తగ్గుతుందని నమ్మింది. మహి భాయ్ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇది సెమీస్ కాబట్టి మరో బౌలర్‌ను ఆడించలేమని చెప్పారు. తొలి ఐదు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చాను. ఫించ్, వార్నర్‌లను ఇబ్బంది పెట్టగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. ఇంజక్షన్ తీసుకున్నా పరిస్థితి మెరుగు కాలేదు. ఇక బౌలింగ్ చేయలేనని ధోనికి చెప్పేశాను. అయితే అతను మాత్రం నీపై నమ్మకముంది. పార్ట్‌టైమర్ అయినా ఎలాగూ పరుగులిస్తాడని అన్నాడు. అలాంటి స్థితిలో నేను ఎప్పుడూ ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత నా కెరీర్ ముగిసిపోతుందని చాలా మంది చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని షమీ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 60కు మించకుండా పరుగులు ఇస్తే చాలని షమీకి ధోని లక్ష్యం విధించగా...షమీ 68 పరుగులు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు మోహిత్ (75), ఉమేశ్ (72)లతో పోలిస్తే మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అయితే ఈ గాయం షమీ కెరీర్‌కు నిజంగానే బ్రేకులు వేసింది. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.