breaking news
new body
-
త్వరలో మా ఏపీ ఎన్నికలు
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నాం’’ అని ‘మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘మా–ఏపీ’ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘మా–ఏపీ’ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక నామినేషన్లు వేసుకోవచ్చు. ఈసారి ‘మా–ఏపీ’ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘మా–ఏపీ’లో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందినవారు పోటీ చేయవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31 వరకు ఏపీలో షూటింగ్లు నిలిపివేశాం. ఎవరైనా షూటింగ్లు జరిపితే శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్ వడ్లమూడి, ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
జెద్దా తెలుగు సంఘం 'తాజ్' నూతన కార్యవర్గం
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) కార్యవర్గానికి నూతన కార్యవర్గం ఎంపికైంది. సంఘం నూతన అధ్యక్షునిగా మహ్మద్ యూసుఫ్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా మెడికొండు భాస్కర్ రావు (గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజ్ అవిర్భావం నుంచి ఈ ఇద్దరు సంస్థ కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించారు. తమ సంఘంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాంత, కుల, మతాతీలకు అతీతంగా సభ్యులుగా ఉన్నారని, తాము సౌదీలోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తామని యూసుఫ్, భాస్కర్ పేర్కొన్నారు. తెలుగువారు 00966561361280 లేదా 00966549103071 నెంబర్లలో సంప్రదించవచ్చుని వారు వివరించారు.