breaking news
Narsinhulapeta
-
బావిలో పడి కౌలు రైతు మృతి
నర్సింహులపేట: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు బావిలో పడి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. నర్సింహులపేటకు చెందిన పెదమాముల నర్సయ్య(55) భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రాత్రి కరెంట్ కావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు బావి మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి బావిలోపడి మృతిచెందాడు. -
అమ్మకు... ‘అమ్మ ఒడి’ ఆశ్రయం
వెంకటాపురం : అందరూ ఉండి అనాథగా మారి రామప్పలో కాలం వెళ్లదీస్తున్న అమ్మకు నర్సింహులపేట మండలంలోని పెద్దముప్పారం ‘అమ్మ ఒడి’ ప్రేమ శరణాలయం ఆశ్రయం కల్పించింది. పరకాల మండలంలోని మాధన్నపేటకు చెందిన నా గుల ప్రమీల అనే మహిళను మూడు నెలల క్రితం కన్నకొడుకు సాంబయ్య జీపులో తీసుకవచ్చి రామ ప్ప ఆలయ పరిధిలో వదిలివెళ్లాడు. దీంతో ఈనెల 21న ‘అమ్మా.. నీకు రామలింగేశ్వరస్వామే దిక్కు’ అనే కథనాన్ని ‘సాక్షి’లో ప్రచురించడంతో స్పందిం చిన అమ్మ ఒడి ఆశ్రమం అధ్యక్షుడు గుంటుపల్లి దిలీప్ అదివారం రామప్ప కు చేరుకొని స్థానికుల సహా యంతో అనాథగా మిగిలిన నాగుల ప్రమీలను ఆశ్రమానికి తీసుకవెళ్లాడు. ఈ సం దర్భంగా దిలీప్ ‘సాక్షి’తో మాట్లాడారు. వృద్ధులను, అనాథ పిల్లల కోసం 2011లో ఆశ్రమాన్ని స్థాపించినట్లు తెలిపారు. ఆశ్రమంలో ప్రస్తుతం 14 మంది వృద్ధులు, నలుగురు పిల్లలు ఉన్నారన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథ వృద్ధులు ఉంటే 9949582234 నంబర్‌కు సమాచారం అందిస్తే ఆశ్రమంలో చేర్చుకుంటామని తెలిపారు. అయనతో పాటు ఆశ్రమం సభ్యుడు శ్రీనివాస్ ఉన్నారు.