breaking news
mla gottipati
-
వేమవరంలో ఇద్దరి దారుణ హత్య
ఎమ్మెల్సీ బలరాం వర్గీయులపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల దాడి బల్లికురవ: ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని కరణం బలరాం వర్గీయులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, అంజయ్య (48), పేరయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు (40), ముత్యాలరావు, వీరరాఘవులు రెండు బైక్‌లపై రాజుపాలెం గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గ్రామ కూడలికి రాగానే రవికుమార్ వర్గీయులైన మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతి, శాఖమూరి సీతయ్య, మరో 40 మంది కర్రలతో బైకులపై వస్తున్న వారిపై దాడి చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో రోడ్డుపై స్పీడు బ్రేకర్లు ఉండటంతో రెండు బైకులు స్లో అయ్యాయి. అది గమనించిన రవికుమార్ వర్గీయులు ఆరుగురి కంట్లో కారం కొట్టి కర్రలతో తీవ్రంగా దాడిచేసి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాల్లో తొలుత చిలకలూరిపేట వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు మృతి చెందారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్టు
ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తన అధికార బలంతో ఝులం ప్రదర్శిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న వారిని పోలీసులతో అణిచివేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా వంటావార్పు, బైక్ ర్యాలీ చేపట్టినందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెం వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర నలు మూలల మద్దతు లభిస్తోంది. దీక్షకు మద్దతు తెలుపుతున్నవారిని పోలీసులు పలుకారణాలపేరిట అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.