breaking news
mistreatment
-
నేటినుంచి ‘గుత్ప’ నీటి విడుదల
ఆర్మూర్ : నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ రైతాంగానికి ఈ ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. అర్గుల్ రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఉదయం నందిపేట మండలంలోని గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఆర్మూర్ ప్రాంత రైతాంగం ప్రధానంగా 2008 నుంచి గుత్ప ఎత్తిపోతల పథకం నీటిపైన ఆధారపడి పంటలను సాగు చేస్తోంది. రెండేళ్లుగా కరువు పరిస్థితులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. దీంతో గతేడాది గుత్ప ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయలేదు. రెండేళ్ల కరువుతో భూగర్భ జలాలూ అడుగంటాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో గుత్ప ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పందించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విషయాన్ని వివరించారు. ఆయన ఆదేశాలతో గురువారంనుంచి నీటిని విడుదల చేయనున్నారు. గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలతో ఆర్మూర్ ప్రాంతంలోని 53 గ్రామాలలో గల 38,792 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. -
ఎయిమ్స్‌లోనూ చికిత్సాలోపం.. లక్ష జరిమానా
ఏదో చిన్నా చితకా ఆస్పత్రులలో వైద్యసేవల లోపం జరిగిందంటే అనుకోవచ్చు.. ఎయిమ్స్ లాంటి పెద్ద ఆస్పత్రిలో కూడా అదే తంతు అని తేలింది. ఓ బాలిక కార్నియా ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమె తల్లిదండ్రులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఎయిమ్స్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హర్యానాకు చెందిన ప్రియాంకకు మూడుసార్లు కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. కానీ మూడూ ఫెయిలయ్యాయి. తగినంత జాగ్రత్తలు తీసుకోకుండా ఆపరేషన్లు చేయడం వల్లే ఇలా జరిగిందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తేల్చింది. ఇందుకు గాను బాలిక తల్లిదండ్రులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 1998 నుంచి 2001 వరకు మూడు సార్లుగా ప్రియాంకకు ఎయిమ్స్‌లో కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. అయితే తమ వైద్యంలో ఎలాంటి లోపం లేదంటూ ఎయిమ్స్ వాదించింది.