మీర్ పేటలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్: మీర్ పేటలో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. పాల ప్యాకెట్ కోసం దుకాణం వద్దకు వచ్చిన మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని మీర్పేట్ ప్రశాంత్‌నగర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన రాజమణి అనే మహిళ పాలప్యాకెట్ కోసం దుకాణం వద్దకు వస్తున్న సమయంలో పల్సర్ బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు