ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి నాలుగు రోజులుగా మౌనపోరాటం చేస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.రజని (25), అదే గ్రామానికి చెందిన చౌటుపల్లి సురేష్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇక పెళ్లి చేసుకుందామని రజని కోరింది. అందుకు సురేష్ ససేమిరా అన్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలన్న ఏకైక డిమాండ్‌తో రజని ఈ నెల 27న సురేష్ ఇంటి ముందు బైఠాయించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న మౌనపోరాటం సోమవారం నాలుగోరోజుకు చేరింది. రజని మౌన దీక్షతో సురేష్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం పెట్టి బంధువుల ఇంటికి చెక్కేశారు.