breaking news
Manappuram gold loan branch
-
మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో భారీ చోరీ
-
అనంత మణప్పురంలో కోట్లు విలువ చేసే బంగారం మాయం
-
అనంత మణప్పురంలో రూ.1.15 కోట్ల బంగారం మాయం
అనంతపురంలోని మణప్పురం గోల్డ్ లోన్ శాఖలో రూ.1.15 కోట్ల విలువైన బంగారం మాయమైంది. దాంతో పోలీసులు ఆ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని అనంతపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అనంతపురంలోని మణప్పురం శాఖలో ఓ వ్యక్తి నగదు తనఖా పెట్టాడు. అనంతరం ఆ నగల్ని విడిపించుకునే క్రమంలో అతడు బ్యాంక్‌కు వచ్చాడు. నగదు కావాలని సిబ్బందిని అడగటంతో అయితే తనఖా పెట్టిన బంగారం కావాలని అడగటంతో మణప్పురం సిబ్బంది మీనామేషాలు లెక్కించారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేశారు. అనంతరం మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయానికి చేరుకుని అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్‌ను ప్రశ్నించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో బంగారంకు సంబంధించి రికార్డు అని సక్రమంగానే ఉన్నాయని పోలీసుల దర్యాప్తుల్లో తేల్చారు. బంగారం మాయంలో విక్రం హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.