breaking news
limited period offer
-
ఆడికార్లపై కళ్లు చెదిరే ఆఫర్..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్‌లోభాగంగా ఐకానిక్ మోడల్స్‌పై ఈ తగ్గింపును అందిస్తోంది. ఆడి పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది. 2009 లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది. ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. ఆఫర్ కింద రూ .49.99 లక్షలకే లభ్యం. తగ్గింపు రూ. 5.81 లక్షలు క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభ్యం. క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అసలు ధర ధర రూ .78.01 లక్షలు. తగ్గింపు రూ .6.02 లక్షలు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు బహుళ ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం కాగా స్టాక్ కొనసాగే వరకు కొనసాగుతుందని ఆడి తెలిపింది. -
మళ్లీ తగ్గిన విమాన చార్జీలు.. రూ. 1899కే టికెట్
చవక విమాన టికెట్లు అందించే స్పైస్ జెట్ సంస్థ మళ్లీ పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. స్వదేశీ విమానయాన మార్గాల్లో రూ. 1899కే టికెట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 'రెడ్ హాట్ ఫేర్స్' అనే ఆఫర్ కింద పన్నులన్నింటినీ కలుపుకొని కూడా టికెట్ ధరను రూ. 1899గా ప్రకటించింది. ముంబై-గోవా, అహ్మదాబాద్- ముంబై, బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, పుణె-బెంగళూరు మార్గాలతో పాటు మరిన్ని మార్గాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్ జెట్ వర్గాలు తెలిపాయి. మూడురోజుల పాటు అందుబాటులో ఉండే ఈ టికెట్ బుకింగులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 8వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి వరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. స్పైస్ జెట్ వెబ్సైట్ ద్వారాను, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్పైస్ జెట్ కాల్ సెంటర్లో గానీ, ఎయిర్పోర్ట్ టికెట్ కార్యాలయాల్లో గానీ మాత్రం ఈ ఆఫర్ టికెట్లు దొరకవు.