breaking news
life after death
-
ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
పునర్జన్మను నిరూపిస్తే మూడున్నర కోట్లు!
దేవుడు, దయ్యం, పాపం, పుణ్యం, ఆత్మ, పరమాత్మ అంటూ మనిషి పుట్టినప్పటి నుంచి తనకు అంతుపట్టని పలు అంశాలపై ఆలోచన చేస్తూనే ఉంటాడు. అయితే ఇలాంటి విషయాలపై ఆస్తికులకు ఉన్నంత ఆసక్తి నాస్తికులకుండదు. మరికొందరేమో సైన్సుకు, మత విశ్వాసాలకు ముడిపెట్టి రెండిటిలో ఏకత్వం సాధించాలని యత్నిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రాచీన కాలం నుంచి మనిషికి తన భవిష్యత్ తెలుసుకోవడంపై ఆసక్తి అధికం. ఈ కాన్సెప్టులోంచి పుట్టిందే పునర్జన్మని కొందరి విశ్వాసం. భవిష్యత్‌లో మనం మళ్లీ జన్మిస్తామన్న ఆశ, పాపాలు చేస్తే మంచి పునర్జన్మ రాదన్న భయం.. ఈ జన్మలో మనం మంచి పనులు చేసేందుకు ప్రేరేపిస్తాయి. కానీ మనిషి ఎదిగేకొద్దీ వీటిపై నమ్మకం కోల్పోతున్నాడు. దీనివల్లనే సమాజంలో పాపభీతి తగ్గిపోతోందని మతాచార్యులు ఘోషిస్తున్నారు. అసలింతకీ పునర్జన్మలుంటాయా? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న. మిలియన్ డాలర్ల ప్రశ్న, బహుమతి.. ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం కోసం అక్షరాలా మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు అమెరికాకు చెందిన డబ్బున్న ఆసామి రాబర్ట్ బిగిలోవ్. ఆయనకు చెందిన బిక్స్(బిగిలోవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ స్టడీస్) సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పునర్జన్మ నిజమని నిరూపించే సాక్ష్యాలను, థియరీలను వ్యాసరూపంలో పంపాలని, వీటిలో ఫస్ట్ వచ్చిన రచనకు హాఫ్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో 3 కోట్ల 66 లక్షల పై చిలుకు), రెండు, మూడు స్థానాల్లో రచనలకు మిగిలిన హాఫ్ మిలియన్ డాలర్లు ఇస్తామని వివరించింది. మనిషి మరణానంతరం అతని చేతనను సజీవంగా ఉంచడం పై ప్రయోగాలకు ఈ సంస్థను రాబర్ట్ స్థాపించాడు. మరణానంతరం మనిషి చేతన కొనసాగేందుకు పునర్జన్మే మార్గమని, అయితే ఇది నిజమని నిరూపించాలని బిక్స్ తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలాంటి వింత పరిశోధనలకు లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచాడు. విశ్వంలో వేరే గ్రహాల్లో తెలివైన జీవులున్నాయా? యూఎఫ్ఓ (ఫ్లయింగ్ సాసర్లు) నిజమేనా? అనే అంశాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయన బోలెడు డాలర్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిస్కవరీ సైన్స్, బిగలోవ్ ఏరోస్సేస్ స్టడీస్ అనే సంస్థలను కూడా నెలకొల్పాడు. అయితే ఈ ప్రశ్నలకు ఆయనకు ఏమి సమాధానాలు లభించాయో బయటకు చెప్పలేదు. తాజాగా పునర్జన్మల నిజాన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. తాను తన సొంతవాళ్లు మరణించినప్పుడు అనుభవించిన బాధ నుంచి ఈ ఆలోచన వచ్చిందని, మనం ప్రేమించిన వాళ్లు మననుంచి దూరమైనా ఇంకోచోట ఉంటారనే నిజాన్ని రాబట్టమే తన లక్ష్యమని రాబర్ట్ చెబుతున్నాడు. మరి ఈ యత్నంలో ఎలాంటి ఆన్సర్లు దొరుకుతాయో? కనీసం ఆయన పునర్జన్మ వివరాలైనా తెలుసుకోగలుగుతాడో? లేదో? వేచిచూడాల్సిందే! -
అయిదు నిమిషాలకో దెయ్యం!
కనుమూర్తి భార్గవి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’. శశి, వెంకట భరద్వాజరెడ్డిలతో కలిసి స్వీయ దర్శకత్వంలో గంగాధర్ రాజరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో మల్టీ డైమన్షన్ వాసు, రాజ్ కందుకూరి, ‘మధురా’ శ్రీధర్ల చేతుల మీదుగా విడుదల చేశారు. ‘‘స్టడీకామ్ కెమెరాతో... ఇంట్లో ఉండే మామూలు లైట్లు వేసి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో ప్రతి అయిదు నిముషాలకూ ఒక దెయ్యం వస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు. -
ఆప్టర్ డెత్ ఎంటర్టైన్మెంట్