breaking news
lakshmi narayana gupta
-
నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు
డిజిటల్ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుటు, విలన్ టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మినారాయణ గప్తా. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వందల సినిమాల్లో నటించాడు. ఈ క్రమంతో తన భార్య మరణంతో నటనకు బ్రేక్ ఇచ్చిన టార్జాన్ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలన్నాడు. చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల ‘దేవుడు దయ వల్ల నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అలా 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను. సినీ కేరీర్ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాని అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో బిబినెస్ మొదలు పెట్టాను. ఎందుకంటే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుకు రూ. 2వేలు మాత్రమే ఇచ్చేవారు. అవి సరిపోక వ్యాపారం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక తనన కుటుంబం గురించి చెప్పుకొస్తూ.. తనది ఆంధ్రప్రదేశ్‌లోని పరిగి సమీపంలో రాపోలు అనే పల్లెటూరని చెప్పాడు. ‘మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న ఊరి సర్పంచ్‌గా చేసేవారు. ఈ క్రమంలో మేమంటే పడని వారు, మా దగ్గరి బంధువులే మా కుటుంబానికి చేతబడి చేశారు. దీనివల్ల రెండేళ్లు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడు. చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు అంతేగాక ‘చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు చేతబడి చేశారు. దీంతో మా అన్నయ్య ఏం తిన్నా వాంతులు చేసుకునేవాడు. నాకు అయితే నీళ్లు తాగిన వెంటనే బయటకు వచ్చేవి. కడుపు నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉండేది. అలా మేము 13 ఏళ్లు నరకం చూశాం. అన్ని నష్టాలే దీంతో ఉన్నవి అన్ని అమ్మేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇక్కడ వచ్చాక డబ్బులు లేక తినడానికి తిండి దొరక్క కష్టాలు పడ్డాం. దీంతో ఏ పని దొరికితే అది చేసేవాళ్లం. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ ప్రారంభించాం. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికీ తన సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతానని. అక్కడ నీళ్లు తాగితే వెంటనే బయటకు వస్తాయని, కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. ఇప్పటికీ చేతబడులు ఉన్నాయని, మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు అన్నాడు. అమావాస్య, పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అయ్య బాబోయ్..అషురెడ్డితో ఆర్జీవీ అలా.. వీడియో వైరల్ -
అమ్మంటే ప్రాణం..
నా ప్రతీ బండిపైనా, సెల్ఫోన్లో ఆమే కనిపిస్తుంది షూటింగ్‌కు, బయటికి వెళ్లినా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా తల్లిదండ్రుల ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యా పెళ్లయ్యాక తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేయొద్దు నిత్య జీవితంలోని సంఘటనలకు ప్రతిరూపాలే సినిమాలు పర్సనాలిటీకి తగ్గట్టుగా లేదని ‘వర్మ’ నా పేరు మార్చారు సిటీ శివారులో అనాథాశ్రమం స్థాపిస్తా నటుడు లక్ష్మీనారాయణ గుప్తా అలియాస్ టార్జాన్ మధ్యతరగతి కుటుంబం మాది. సొంతూరు పరిగి మండలం రాపోల్. అమ్మ వీరమణి, నాన్న రాములు గుప్తా. ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ప్రాథమిక విద్య ఊర్లోని సర్కారు బడిలోనే సాగింది. ఏడో తరగతి వరకు పోల్కంపల్లిలోని యూపీ పాఠశాలో, ఆ తర్వాత పరిగి ఉన్నత పాఠశాలలో టెన్త్ పూర్తి చేశా. అప్పట్లో రవా ణా సౌకర్యంలో లేకపోవడంతో ఏడోతరగతి వరకు రోజుకు ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లే వాడిని. టెన్త్‌వరకు సైకిల్‌పై వెళ్లా. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఊర్లోని పొలం, ఇల్లు అమ్ముకుని సిటీకి వచ్చేశాం. నగరానికి వచ్చాక ఇంటర్మీడియట్లో చేరినప్పటికీ చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయా. ఈ క్రమంలోనే ట్రాన్స్‌పోర్ట్‌లో పనికి కుదిరా. కొన్నిరోజులు అలా కాలంగడిపా. వీరయ్య నాటకంతో... మా ఊరి సమీపంలోని పోల్కంపల్లిలో వీరయ్య అనే రంగస్థల నటుడు బ్రహ్మంగారి నాటకం వేశారు. వరుసగా ఐదు రోజులపాటు ఆ నాటకం సాగింది. తొలిరోజు వెళ్లినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. దీంతో మిగతా నాలుగు రోజులు.. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లా. దాంతో నాటకాలపై మరింత ఆసక్తి పెరిగింది. నర్సింగ్ అనే స్నేహితుడు నన్ను సినిమావైపు దారి మళ్లించాడు. రామ్‌గోపాల్ వర్మ దగ్గరికి తీసుకెళ్లి వదిలేశాడు. దాంతో వర్మగారు నాకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి తన తొలి సినిమా శివలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత గాయం సినిమాలో.. అలా నా సినిమా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా మొదలైంది. తెలుగు, తమిళం తదితర భాషల్లో సుమారు 150 సినిమాల్లో నటించా. పేరు మారిందిలా.. నా అసలు పేరు లక్ష్మీనారాయణ గుప్తా. మొదటిసారి రామ్‌గోపాల్ వర్మను కలిసినప్పుడు ఏం పేరు అని అడి గారు. దాంతో నా పేరు ఫలానా అని చెబితే.. నన్ను ఆపాదమస్తకం చూసి.. పేరు బాలేదయ్యా. నీ పర్సనాలిటీకి సూట్ కావట్లేదు. టార్జాన్ అని మార్చుకో అన్నారు. దాం తో ఆరోజు నుంచి నాపేరు టార్జాన్‌గా మారిపోయింది. రోజూ కొత్తదనమే సినిమా నటులకు రోజూ కొత్తగానే ఉంటుంది. ఒక్కో డెరైక్టర్ ఒక్కో తరహాలో నటనను కోరుకుంటారు. సినిమా మొత్తం వాళ్ల ఆలోచన తీరు, స్క్రిప్ట్‌పైనే ఆధారపడి ఉంటుంది. సో.. వాళ్లు చేయమన్న తరహాలో నటించాలి. దీంతో నేను ఇలా ఉంటా.. అలా ఉంటా.. అని చెప్పలేం. ఇరవై ఏళ్లకుపైగా సినిమా రంగంలో ఉన్నా. రామ్‌గోపాల్ వర్మ నాకు గురువు. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, అమ్మరాజశేఖర్, వంశీ తదితర పెద్ద దర్శకులందరి దగ్గరా పనిచేశా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఈ కొత్తదనం చాలా ఆనందంగా ఉంటుంది. కళాకారుడి గొప్పతనం ఇదే నేను రెగ్యులర్‌గా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటా. మూడేళ్ల క్రితం అహోబిలం ఆలయానికి వెళ్లా. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. కలెక్టర్‌తో సహా పలువురు అధికారులు అక్కడే ఉన్నారు. నేను మా ఫ్యామిలీతో వెళ్లా. నన్ను గుర్తుపట్టిన అ ర్చకులు కలెక్టర్ దగ్గరినుంచి నా దగ్గరికి వచ్చారు. మర్యాద గా పలకరించారు. దీంతో కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి అ ర్చకులతో అడిగాడట నా గురించి. తర్వాత తెలిసింది. అధికారులు, ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ గౌరవం కళాకారులకు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కరంగానూ ఉంటుంది. ప్రశాంతంగా షాపింగ్‌కు వెళ్లలేం.. హో టల్లో చాయ్ తాగలేం.. ఇలాంటి ఇబ్బందులుంటాయి. వాళ్లను చూస్తే బాధనిపిస్తుంది సినిమా పరిశ్రమ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ అవకాశాల్ని అందిపుచ్చుకుని, పొదుపు మంత్రం పాటించిన వాళ్లు బాగానే ఉంటారు. జల్సాలకు పోయి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఇబ్బందులు తప్పవు. పరిశ్రమకు జూనియర్ ఆర్టిస్టులు చాలా అవసరం. అయితే చాలామంది జూనియర్ ఆర్టిస్టులకు షూటింగ్ ఉన్న రోజే తిండి.. లేకుంటే పస్తులే. అవకాశం కోసం దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు.. పస్తులున్న విషయాన్ని విన్నవించి ప్రా ధేయపడతారు. అలాంటి సందర్భాలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. తగిన గుర్తింపు లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం. నిజ జీవిత సంఘటనల ఆధారంగానే.. సమాజంపై సినిమాల ప్రభావం ఉంటుంది. అయితే సమాజాన్ని సినిమాలు చెడగొడుతున్నాయనుకోవద్దు. నిజ జీవితంలోని ఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తారు. కాబట్టి వాటిని వేరే రకంగా చూడకూడదు. అమ్మ ఆశీస్సులు తప్పనిసరి మా అమ్మంటే నాకు ప్రాణం. ప్రతి పనికి ముందు అమ్మను తలుచుకుంటా. అంతెందుకు ప్రతి బండిపైనా.. సెల్ఫోన్లో.. ఇలా అన్ని చోట్లా అమ్మే కనిపిస్తుంది. అమ్మా, నాన్న ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యా. రోజూ ఇంట్లోం చి షూటింగ్కో, బయటికో వెళ్లేటప్పుడు అమ్మ ఆశీస్సులు తీసుకుంటా. ఓసారి చెన్నైలో షూటింగ్ వెళ్లేటప్పుడు ఫ్లైట్ టైం అవుతోందని హడావుడి చేయడంతో బట్టలు సర్దుకుని బయలుదేరా. ట్యాంక్‌బండ్ వరకు వచ్చేశా. కానీ నాలో ఏదో తెలియని ఆందోళన.. ఏదో మర్చిపోయాననే ఫీలింగ్. బాగా ఆలోచిస్తున్నా.. అమ్మ ఆశీస్సులు మర్చిపోయా. వెంటనే బండి వెనక్కి తిప్పమని డ్రైవర్‌కు చెప్పా. ఫ్లైట్ టైం అయిపోతుందని డ్రైవర్ వారించినా వినలేదు. ఇంటికి వెళ్లి అమ్మ ఆశీస్సులు తీసుకుని తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయలుదేరా. విచిత్రం ఏమిటంటే.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ గంట లేటుగా వచ్చింది. ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతా.. సినిమాలు ఎక్కువగా చూస్తా. నచ్చిన చిత్రం పోకిరి, శ్రీఆంజనేయం. ఆధ్యాత్మిక గ్రంథాలు, రమణ మహర్షి పుస్తకాలు చదువుతుంటాను. నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకుంటా. రోజుకు 4 కి.మీ. రన్నింగ్, రెండు గంటలు జిమ్, గంట పాటు మెడిటేషన్ చేస్తా. భార్య ఉమారాణి గృహిణి. కూతురు ఆశ్విత, కుమారుడు విక్రమ్. ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి.. జన్మనిచ్చి.. పెంచి.. తెలివి వచ్చేవరకు పోషించిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. పెళ్లైన మరుసటి రోజునుంచి వేరు కాపురాలు పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సాకినందుకు వాళ్లకిచ్చే గౌరవం ఇదేనా. చాలాచోట్ల ఈ సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ వార్తలు చదివినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది. డబ్బు పోతే తిరిగి వస్తుంది. కానీ అమ్మ, నాన్నలు రారు. అందుకే తల్లిదండ్రులను బాగా చూసుకోండి. నేను యువతకిచ్చే సందేశం ఇదే. వైఎస్ రియల్ సీఎం.. ఊటీలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నా. అక్కడికి 108 అంబులెన్స్ వచ్చి ఆగింది. ఈ వాహనం ఇక్కడికెలా వచ్చిందని డ్రైవర్‌ను అడిగా. వెంటనే డ్రైవర్ ‘అరె భాయీ.. ఇది ఆంధ్ర సీఎం రాజశేఖరరెడ్డి పెట్టిన 108కు కాపీ’అని ఠక్కున చెప్పేశాడు. అప్పుడనిపించింది వైఎస్ గొప్పదనం. ఇంకో విషయం ఏమిటంటే.. సిటీలో వేల మంది సొంతింటి కల సాకారం చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ ఒక అద్భుత పథకం. ఇవన్నీ ఇప్పటివరకున్న సీఎంలకు సాధ్యం కాలేదు. అందుకే వైఎస్ఆర్ ఈజ్ గ్రేట్. ఆశ్రమం నెలకొల్పుతా.. నాకు డబ్బు ఆశ లేదు. అవకాశాలు వచ్చినన్ని రోజులు సద్వినియోగం చేసుకుంటా. అయితే సిటీ శివారులో ఒక ఆశ్రమం నెలకొల్పాలనేది నా కోరిక. తప్పకుండా ఏర్పాటు చేస్తా. వృద్ధులకు బుక్కెడు బువ్వపెట్టి ఆశ్రయం కల్పిస్తా.