breaking news
kothamajeru
-
'ఇతర అనారోగ్యాల వల్లే ఆ మరణాలు..'
చల్లపల్లి (కొత్తమాజేరు): కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో ఇటీవల చనిపోయిన వారంతా ఇతర అనారోగ్య కారణాలతోనే మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. రెండు నెలల క్రితం విష జ్వరాలతో 18 మంది చనిపోతే అప్పటి నుంచి గ్రామాన్ని సందర్శించని ఆరోగ్యశాఖ మంత్రి.. ఇపుడు సందర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసి 24 గంటలు గడవక ముందే ఆ గ్రామాన్ని మంత్రి కామినేని సందర్శించటం గమనార్హం. అంతా అదుపులోనే ఉంది.. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 'విషజ్వరాలతో భయపడుతున్న కొత్తమాజేరు గ్రామంలో పరిస్థితి అంతా అందుపులోనే ఉంది. గ్రామంలో విషజ్వరాలు ప్రబలినప్పటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ ఎ.బాబు ద్వారా వివరాలను తెలుసుకుంటూనే ఉన్నాం. తద్వారా వెంటనే గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు వైద్య సదుపాయం అందించాం. గ్రామంలో చనిపోయిన వారంతా ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారు. మరి కొద్దిరోజుల పాటు గ్రామంలో వైద్యశిబిరం కొనసాగించాలని అధికారులను ఆదేశించాం. మృతుల కుటుంబాలను కలవకుండా, వివరాలు తెలుసుకోకుండా సమావేశం కొనసాగినంతసేపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. పత్రికల్లో చూసి తెలుసుకున్నా.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామంలోని పరిస్థితి జూన్ 17న పత్రికల్లో చూసి తెలుసుకున్నానని, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తూ గ్రామంలో కూడా పలుమార్లు పర్యటించానని చెప్పారు. పంచాయతీలో నిధులు ఉండి తీర్మానం చేయకపోవడంపై పంచాయతీ నిర్వాహకులపై, అధికారులపై చర్యలు తీసుకుని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పైడిపాముల కృష్ణకుమారి, సర్పంచ్ మాచవరపు సునీత, డీఎంహెచ్వో నాగమల్లేశ్వరి, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
’బాబుకు చీమ కుట్టినట్లైనా లేదు’
-
4న కొత్తమాజేరుకు వైఎస్ జగన్
విషజ్వరాల మృతుల కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరు గ్రామంలో విష జ్వరాలు సోకి మరణించిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. కొంత కాలంగా ఈ గ్రామంలో కలుషిత తాగునీటి కారణంగా మరణాలు సంభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కృష్ణా జిల్లా పార్టీ నేతలు, స్థానిక నేతలు కొత్త మాజేరుకు ఇప్పటికే ఒకసారి వెళ్లి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వైఎస్ జగన్ ఆ గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం 'సాక్షి'కి తెలిపారు. వైఎస్ జగన్ ఈనెల 4వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కొత్తమాజేరుకు వెళ్లి.. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ గ్రామంలో మంచినీటి సరఫరా పరిస్థితిపై స్థానిక అధికారులతో జగన్ సమీక్షిస్తారు. అదే రోజు విజయవాడకు చేరుకుని విమానంలో సాయంత్రానికి హైదరాబాద్కు చేరుకుంటారు. జగన్ పర్యటనలో జిల్లా పార్టీ నేతలు కూడా పాల్గొంటారు.