breaking news
komatareddy
-
కాంగ్రెస్ పార్టీకి ఇంటి పార్టీ సెగ
-
'కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్'
నల్లగొండ : కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ పార్టీ ఉం టుందని, ఆ తర్వాత 14 ముక్కలవడం ఖాయమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అనంతరం టీఆర్ఎస్ కేటీఆర్, టీఆర్ఎస్ హరీశ్‌రావు, టీఆర్ఎస్ కవిత, టీఆర్ఎస్ వినోద్ కుమార్ ఇలా 14 ముక్కలు అవుతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. జై తెలంగాణ అనవద్దని హెచ్చరించిన తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంటివారికి మంత్రి పదవులు లభించాయని, ఉద్యమంలో కొడుకును పోగొట్టుకున్న శంకరమ్మకు ఏమీ లేకుండా పోయిందన్నారు.