breaking news
Kendriya Vidyalaya students
-
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్‌ను ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సత్తా చాటిన గచ్చిబౌలి కేవీ అథ్లెట్లు
రాయదుర్గం, న్యూస్‌లైన్: జాతీయ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటి పతకాలు సాధించిన గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ క్రీడాకారులను సన్మానించారు. గత నెల 19 నుంచి 23 వరకు గౌహతిలో బాలికలకు, 24 నుంచి 28 వరకు చండీగఢ్, చెన్నైలో బాలుర పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తలపడిన కేవీ ఆటగాళ్లు వివిధ విభాగాల్లో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. విజేతలు అక్షయ, నూతన్ (తైక్వాండో), ఎస్.శుభం (అథ్లెట్), నమ్రత చంద్ర (బ్యాడ్మింటన్), ఆశిష్ (చెస్), కావ్య శ్రేయ (స్విమ్మింగ్), జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వీణయ్య, పీఈటీ విజయభాస్కర్‌రెడ్డి, కోచ్ రాంబాబు, సత్యమహేశ్, అరుణ్‌లు పాల్గొన్నారు.