breaking news
keesara toll plaza
-
కీసర టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తుండటంతో కృష్ణా జిల్లాలోని కీసర టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు వస్తుండంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి కీసర టోల్గేట్ వద్ద పెద్ద మొత్తంలో వాహనాలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు ప్రతినిధులు తెలిపారు. రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
వరుస సెలవులు.. టోల్‌ప్లాజా కిటకిట
అర కిలోమీటరు మేర బారులు దీరిన కార్లు కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర కార్లు బారులుదీరాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో సొంత ఊళ్లకు వచ్చిన వారంతా తిరిగి తమ వాహనాల్లో మంగళవారం హైదరాబాద్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో కీసర టోల్‌ప్లాజా వద్ద అరకిలోమీటరు మేర కార్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అనంతరం టోల్‌ప్లాజా మేనేజర్ జయ ప్రకాశ్ మాట్లాడుతూ రోజుకు సుమారు 12 వేల కార్లు హైదరాబాద్ వైపునకు వెళ్తున్నాయని, దీనివల్ల టోల్‌ప్లాజాకు రూ.6 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు.