breaking news
kanyakaparameswari
-
జగన్మాత నమోనమః
బద్వేలు అర్బన్: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఆలయాలలో అమ్మవారు విశేష పూజలందుకుంటూ కొలువు దీరారు. 7వ రోజైన శుక్రవారం వాసవి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు బిల్వవృక్షవాసవీదేవి జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఈ ఆలయంలో నిర్వహించిన తోటోత్సవం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. శుక్రవారంతో పాటు తోటోత్సవం నిర్వహిస్తుండటంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అలాగే స్థానిక మహాలక్ష్మిదేవి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణతులాభారం కూడా నిర్వహించారు. అలాగే కోదండరామస్వామి ఆలయంలో శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రంగనాధ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అలాగే వీరభద్రస్వామి దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వీటితో పాటు మడకలవారిపల్లెలోని సుదర్శన ఆశ్రమం, పోలీసు స్టేషన్ ఆవరణలోని దుర్గమ్మ ఆలయాలతో పాటు గాలిదేవర్ల ఆలయంలోని అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ , ప్రసాదాలు అందజేశారు. -
కన్యకాపరమేశ్వరికి బంగారుచీర
పాతపోస్టాఫీసు: పాతనగరంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మూలవిరాట్‌ను బంగారు చీరతో అలంకరించనున్నారు. 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంలోని మూల విరాట్‌ను సుమారు 4 కేజీల బంగారంతో తయారుచేయించిన బంగారు చీరను అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల సంఘం కార్యదర్శి యలమర్తి హరనాథ్, అధ్యక్షుడు నల్లూరి నూకరాజు మాట్లాడుతూ నగరంలోని ఆర్యవైశ్య భక్తుల విరాళాల ద్వారా సేకరించిన బంగారంతో వైభవ్ జ్యూయలరీ వారి ఆధ్వర్యంలో బంగారు చీరను తయారు చేయించామని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా ఈనెల 19న అమ్మవారికి చీరను అలంకరించనున్నామని అన్నారు. నగరంలోని భక్తులు యావన్మందీ ఈ వేడుకను కనులారా తిలకించాలని కోరారు.