breaking news
jaya lalitha death
-
జయలలిత మృతి: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు
సాక్షి, చైన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. కాగా, జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను సీఎం స్టాలిన్‌కు అందజేశారు. 600 పేజీలతో కమిషన్ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం. అయితే, 2016 సెప్టెంబర్ 22వ తేదీన జయలతిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో మాజీ జడ్జీ జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిషన్.. ఐదేళ్ల కాలంలో జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. కమిషన్ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు, విధుల్లో ఉన్న చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అయితే, విచారణలో భాగంగా ఆర్ముగ స్వామి కమిషన్ సుమారు రెండు వందల మందిని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్ -
అమ్మ మరణంపై త్వరలో సీబీఐ దర్యాప్తు!
మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రకటించిన 10 రోజుల పండుగ జరుపుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు, ఆంధ్రా రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలలో పలు సాంఘిక సేవ కార్యక్రమాలను ఫిబ్రవరి 24 నుంచి చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ‘స్వతంత్ర నగర్’ లో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తమిళనాడు తెలుగు యువశక్తి రాష్ర్ట అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్వతంత్ర నగర్ తెలుగు పెద్దలు మొండెం కృష్ణమూర్తి, గరికిపాటి సుబ్బారావు, బక్కా శ్రీనివాసులు, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి బీ గోవర్ధన్, సీటీ సూర్య, కే మోహన్‌కృష్ణ, ఎస్ మహేష్ కుమార్, డీ ఈశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీదేవి, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. సభా ప్రారంభానికి ముందు అమెరికాలో జాతివివక్షతకు బలైన భారతీయుల ఆత్మ శాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేతిరెడ్డి మాట్లాడుతూ.. జయలలితగారి 69వ జన్మదిన వేడుకలను తమిళనాడు తెలుగు యువశక్తి కార్యకర్తలు ఘనంగా జరపడం సంతోషకరమని తెలిపారు. త్వరలో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరచిన మహిళలకు ఏటా ఇచ్చే ‘అమ్మా యంగ్ ఇండియా’ అవార్డులు ప్రధానం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు తమిళనాడులో ప్రజాస్వామ్య విలువలను కాలరాయాలని చూస్తున్నారన్నారు. పదవీకాంక్ష, ధనకాంక్ష జయలలిత మరణంకు కారణమన్నారు. తమిళనాడు ప్రజలకు జయలలిత మరణం పలు అనుమానాలకు తావిస్తుందని, 75 రోజులుగా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలే అందుకు ఆధారాలని అన్నారు. పొంతనలేని ప్రకటనలు, ఆమేను కలిసేందుకు వచ్చిన వారిని కలవనీయకుండా చేయడం చూస్తుంటే ఈ మరణం వెనక ఏదో కుట్ర దాగి ఉన్నదని చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు అపోలో హాస్పెటల్లో జరిగిన రాజకీయ డ్రామా తమిళనాడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల కోర్కెలను నివృత్తి చేయుటకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలివ్వాలన్నారు. డిసెంబర్ 5 నుంచి ఎన్నో రకాల పోటాలు తాను చేపట్టడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు నందు కేసు, రాష్ర్టపతికి, ప్రధానికి, కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. ఉద్యమంలో భాగంగా పోస్ట్ కార్డుల ద్వారా నిరసనలు తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా తిరుపతి వెంకన్న ఉండీకి సంబంధించిన సీబీఐ విచారణ కోరుతూ వినతి పత్రం వేశామన్నారు. ప్రతిపక్షాలు కూడా మొదటి నుంచి విచారణ కోరుతూ తమ నిరసన తెలియజేస్తున్నారని చెప్పారు. నేను చేసిన ప్రయత్నానికి ఫలితం త్వరలో ఉంటుందన్నారు. వినతి పత్రాలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోబోతుందన్నారు. 5 రాష్ర్టాల ఎన్నికల తర్వాత కేంద్రం కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తుందన్న బలమైన నమ్మకం తనకు ఉందని చెప్పారు. అదే జరిగితే తమిళనాడులో జయలలితను అభిమానించేవారి గుండెల్లో బీజేపీకి, నరేంద్ర మోదీకి చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం ఉంటుందని చెప్పడంలో సందేహంలేదు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులందరికీ జయలలిత మరణం గురించి మాట్లాడడం రాజకీయ పునరావాసంగా తయారైందని కొనియాడారు. గతంలో ప్రజలు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోని జయలలిత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు విచారణ గురించి ఇప్పుడు వ్యక్తం చేయడం వింతగా ఉందన్నారు. నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎడపాటి పళని స్వామిని కోరేదేమిటంటే అమ్మ జయలలిత మరణం పట్ల ప్రజలకి అనుమానం ఉన్నది. కావునా ఈ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన భాద్యత నీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఉందన్నారు. కాబట్టి వెంటనే కేంద్రాన్ని సీబీఐ విచారణను డిమండ్ చేస్తూ నీతోపాటు మంత్రివర్గం డిమాండ్ చేయడమే నువ్వు అమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రతిపక్షాలు కూడా సీబీఐ విచారణ కోసం ప్రజా ఉద్యమాలు చేయాటకు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.