breaking news
Japan Football Association
-
ఈ వయసులో బంతిని తన్నడం అంటే మాటలా?
మామూలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 35 ఏండ్ల వయసులో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ, జపాన్ వెటరన్ ప్లేయర్ కజుయోషి మియుర విషయంలో మాత్రం మరోలా ఉంది. 56 ఏండ్ల వయసులోనూ యువకులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతూ.. రిటైర్మెంట్ కావడానికి నిరాకరిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కువ వయసు ఉన్న ఏకైక ప్లేయర్‌గా మియుర కొనసాగుతున్నాడు. పోర్చుగల్‌కు చెందిన లిగా-2తో కలిసి మరో సీజన్‌కు కాంట్రాక్టు పొందిన మియురాను అందరూ ముద్దుగా ‘కింగ్ కాజు’ అని పిలుచుకుంటారు. సరిగ్గా 37 ఏండ్ల క్రితం తన ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టిన మియుర.. జపాన్ తరఫున అత్యధిక కాలం కొనసాగాడు. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌కు 89 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్ సాకర్ ప్లేయర్ 55 గోల్స్ చేశాడు. 1992లో ఏఎఫ్సీ ఆసియా కప్ గెలిచిన జపాన్ జట్టులో మియుర సభ్యుడు కావడం విశేషం. 23 ఏండ్ల క్రితం జపాన్ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న మియూర.. పోర్చుగల్ క్లబ్‌కు సేవలందిస్తున్నాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' #TNPL2023: టీఎన్‌పీఎల్ విజేత లైకా కోవై కింగ్స్.. వరుసగా రెండోసారి -
ఆ ఫుట్ బాల్ మేనేజరే మాకు ముద్దు!
టోక్యో: గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జపాన్ ఫుట్ బాల్ మేనేజర్ జావియర్ అగ్యుర్ కు తిరిగి అవే బాధ్యతలు అప్పజెప్పటానికి ఆ దేశ ఫుట్ బాల్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసింది. గతంలో స్పెయిన్ లో ఒక లీగ్ మ్యాచ్ సందర్బంగా జావియర్ అగ్యుర్ పై ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మేనేజర్ బాధ్యతలను తప్పించారు. అయితే ఆసియా కప్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ పేలవమైన ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది. దీంతో అతన్ని జట్టు మేనేజర్ గా జావియర్ తిరిగి చేర్చుకోవాలని ఫుట్ బాల్ అసోసియేషన్ భావిస్తోంది. త్వరలోనే జావియన్ తిరిగి జట్టుతో కలుస్తాడని జేఎఫ్ఏ చైర్మన్ కునియా దైనీ స్పష్టం చేశారు. 'జపాన్ ఫుట్ బాల్ జట్టుకు జావియర్ సేవలు అవసరం. అతను విధులను సక్రమంగా నిర్వర్తించి దేశ పుట్ బాల్ ఉన్నతికి సహకరించాడు. అందుచేత అతన్ని మళ్లీ మేనేజర్ గా నియమిస్తున్నాం' అని దైనీ తెలిపాడు.