breaking news
influence of liquor
-
మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025 -
హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
సాక్షి, హైదారాబాద్: జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ కీచకుడు వివస్త్రను చేశాడు. పెద్దమారయ్య (30) అనే కూలీ తాగిన మత్తులో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు చింపేసి అందరి ముందు పరువు తీశాడు. అడ్డుచ్చిన వారిపై సైతం దాడికి తెగబడ్డాడు దుర్మార్గుడు. దీంతో 15 నిముషాల పాటు యువతి రోడ్డుమీద నగ్నంగా ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లాక పలువురు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి, మారయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
హత్యానేరాన్ని నీరుగార్చేందుకు మత్తు ప్రాతిపదిక కాబోదు: సుప్రీం
న్యూఢిల్లీ: హత్య చేసిన వ్యక్తి మత్తులో ఆ పని చేశాడనటం.. హత్యా నేరాన్ని అసంకల్పిత హత్యగా పలుచన చేసేందుకు ప్రాతిపదిక కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య చనిపోయేలా కాల్చడమనే సంఘటన.. అసంకల్పిత హత్య లేదా నిందితుడు మద్యం మత్తులో ఉన్నందున అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు, అనే కేటగిరీ కిందకు వస్తుందనే వాదన ను ఆమోదించడం కష్టమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడనుకున్నప్పటికీ వంటిపై కిరోసిన్ జల్లి అగ్గిపుల్ల గీసి అంటిస్తే ఆ వ్యక్తి కాలిన గాయూలతో చనిపోయేందుకు అవకాశం ఉందనే వాస్తవం కూడా అతనికి పూర్తిగా తెలుసునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. చిత్తుగా తాగిన వ్యక్తికి కూడా కొన్నిసార్లు తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుందని న్యాయమూర్తులు కె.ఎస్.రాధాకృష్ణన్, విక్రమజిత్సేన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భగవాన్ తుకారాం డాంగేకు దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థించిన ధర్మాసనం, ఈ విషయమై బోంబే హైకోర్టు తీర్పును ధ్రువీకరించింది.