ఆక్రమణదారులు ఎవరైనాసరే కఠినంగా ఉండాలి: కేసీఆర్
హైదరాబాద్: గురుకుల ట్రస్ట్ భూముల్లో ఆక్రమణల తొలగింపుపై ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సామాన్యుల ఇళ్లనే తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని.. అధికారులు పెద్దల జోలికి ప్రభుత్వం వెళ్లట్లేదనే వార్తలు మీడియాలో వస్తున్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆక్రమణదారులు ఎవరైనాసరే కఠినంగా ఉండాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అక్రమ నిర్మాణాల తొలిగింపును కొనసాగించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు గత కొద్దిరోజులుగా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.