breaking news
health care plan
-
50 కోట్ల మంది కోసం.. ఉపాసన సరికోత్త ఆలోచన
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవితంలో అత్యంత విలువైనదిగా భావించేది ప్రాణం. అందుకే ఏ చిన్న పాటి అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే వారు కోకొల్లలు. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. కరోనా వచ్చాక మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిందనే చెప్పవచ్చు. హెల్త్ పాలసీలు తీసుకునే వారిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే అధికం. ఎందుకంటే వారు గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్లలేరు.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ హస్పటిల్‌కు వెళ్లే ధైర్యం కూడా చేయలేరు. దాంతో మధ్యే మార్గంగా ఆరోగ్యబీమా పాలసీలతో నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్ కవరేజ్ మోడల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేశారు. ‘అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ.. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్ కవరేజ్ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్’ అంటూ ఉపాసన ట్వీట్ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ‘దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ ఇన్యూరెన్స్ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు. (చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్) AFFORDABLE HEALTHCARE FOR ALL ! We are keen to pledge our support by partnering with insurance companies & the government to develop the best suited health coverage model for the 50 crore #missingmiddle Indians. @FHPLHealth Jai Hind 🙏🏼 pic.twitter.com/XdqHZkK58q — Upasana Konidela (@upasanakonidela) August 24, 2020 ఎఫ్‌హెచ్‌పఎల్.. ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ (ఎఫ్‌హెచ్‌పఎల్), 1995లో విలీనం చేయబడింది. 2002 లో ఐఆర్డీఏ లైసెన్స్ పొందింది. నేడు దేశంలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ పొందిన ఐఆర్డీఏ లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లలో ఎఫ్‌హెచ్‌పఎల్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఉండగా దేశవ్యాప్తంగా 55కు పైగా స్థానాల్లో, 25 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. వ్యక్తిగత కస్టమర్లు, కార్పొరేట్ ఖాతాదారులకు, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య పథకాలకు ఆరోగ్య బీమా ప్రయోజనాల పరిపాలన అవసరాలను ఎఫ్‌హెచ్‌పీఎల్ అందిస్తోంది. నాణ్యత ప్రమాణాలు, ప్రక్రియల కోసం ఐఎస్ఓ 9001: 2008 తో ధృవీకరించబడిన మొదటి లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఎఫ్‌హెచ్‌పీఎల్ కావడం విశేషం. -
పండించకుండానే పడేశారు
♦ కార్యాలయంలో మూలన కూరగాయల విత్తనాలు ♦ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ♦ ఏడాదిగా మెప్మా కార్యాలయంలో మూలుగుతున్న వైనం ♦ ఆరోగ్య పరిరక్షణ పథకం ఉత్తిదే పట్టణాల్లోని పేదవారు పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు ఏడాది పొడవునా కూరగాయలను పండించుకుని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది ఆరోగ్య పరిరక్షణ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని మెప్మా సంస్థ నీరుగార్చింది. పథక లక్ష్యాన్ని మూలన పడేసిందని ఉద్యానశాఖ అధికారులు విమర్శిస్తున్నారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన విత్తనాలను ఏడాదిగా కార్యాలయంలో నిర్లక్ష్యంగా వదిలేయడమే ఇందుకు నిదర్శనం. కడప అగ్రికల్చర్: సమాజంలో అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో కేంద్రం ఆరోగ్య పోషణ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో తొలిసారిగా పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు ఆధునిక వంగడాలతో రూపొందించిన కూరగాయ విత్తనాలను అందించి ఆహార కొరతను కొంతవరకు నివారించాలనేది లక్ష్యం. పేదవర్గాల వారికి ఆయా విత్తనాలను అందించి కూరగాయలను ఇంటి ఆవరణల్లో సాగు చేసుకునేలా వీలు కల్పించారు. ఈ ఆరోగ్య పోషణ పథకాన్ని ఉద్యానశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)ద్వారా అమలుచేయాలని ప్రణాళికను రూపొందించారు. బెంగళూరు నుంచి విత్తనాలు గతేడాది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ హాసరగట్ట బెంగళూరు నుంచి నాణ్యమైన 8రకాల కూరగాయ విత్తనాలను ఉద్యానశాఖ తీసుకువచ్చింది. జిల్లాలో అన్ని పట్టణాల్లోని మెప్మా సంఘాలకు అందజేసేలా మొత్తం 3,300 ప్యాకెట్లు తీసుకువచ్చారు. ఈ విత్తన పాకెట్ల అసలు ధర రూ.3.96 లక్షలుకాగా, ఇందులో రూ.1.98 లక్షల సబ్సిడీ ఇచ్చా రు. ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ.120లుకాగా, ఇందులో 50 శాతం సబ్సిడీ పోను రూ.60కి మహిళలకు అందజేయాల్సి ఉంది. ఆ కూరగాయ విత్తనాలను కడపలోని మెప్మా సంస్థకు అందజేశారు. గతేడాది మెప్మా సంస్థకు అందజేసినా వాటిని ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఇవ్వకుండా మూలనపడేశారు. దీనికి సంబంధించిన వివరాలు కావాలని ఆడిట్‌శాఖ సిబ్బంది ఉద్యానశాఖను కోరింది. దీంతో అసలు విషయం బయపడింది. విత్తనాలను పంపిణీ చేయకుండా మూలన పడేసిన మెప్మాపైన, ఆరా తీయని ఉద్యానశాఖపై ఆయా శాఖలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. తమకు పూర్తి ధరకు ఇచ్చి ఉంటే ఇళ్ల ఆవరణలో సాగు చేసుకుని ఎంతో కొంత ఖర్చులు తగ్గించుకునే వారమని ప్రజలు అంటున్నారు.