breaking news
government ban
-
శారిడాన్‌కు సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ : డ్రగ్స్ నిషేధ జాబితా నుంచి శారిడాన్‌కు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్ జాబితా నుంచి శారిడాన్, డార్ట్, పిరిటాన్ ఎక్స్‌పెక్టోరాంట్ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. శారిడాన్, డార్ట్, పిరిటాన్ ఎక్స్‌పెక్టోరాంట్‌లను మార్కెట్లో విక్రయించుకునేలా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యానికి హాని కరంగా ఉన్నాయంటూ దాదాపు 328 డ్రగ్స్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో, గ్లాక్సోస్మిత్‌క్లైన్, పిరామల్ వంటి డ్రగ్స్ మేకర్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ ప్రొడక్ట్‌లు, ఆయా కంపెనీలకు పాపులర్ బ్రాండ్లు. 328 మెడిషిన్లపై నిషేధం విధిస్తూ.. కేంద్రం జారీచేసిన నోటీసులపై ఈ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జాబితా నుంచి తమ కాంబినేషన్స్‌ను మినహాయించాలని కంపెనీలు కోరాయి. 1988 నుంచి ఈ కాంబినేషన్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు చెప్పాయి. అంతకముందు కూడా సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిషేధం నుంచి ఇలాంటి 15 కాంబినేషన్లను మినహాయించినట్టు తెలిపాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గ్లాక్సోస్మిత్‌క్లైన్ ధృవీకరించింది. పిరామల్ గ్రూప్ ఇంకా స్పందించాల్సి ఉంది. -
గుట్కా మాఫియాపై సీబీఐ పంజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం. మాజీ మంత్రి, ఐఆర్ఎస్ నివాసాల్లోనూ గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి గుల్జార్ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్‌ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి గుట్కా, పాన్ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్‌సేల్ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్‌లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది. శశికళకూ సంబంధాలు? జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, డీజీపీ అశోక్‌కుమార్‌లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత దురైమురుగన్ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. చెన్నైలో రాజేంద్రన్ ఇల్లు -
బదిలీలకు సై
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఊరట సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ లపై సర్కారు నిషేధం ఎత్తివేసింది. గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడు బదిలీలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. ఉద్యోగుల పంపకంలో భాగంగా కమలనాథన్ కమి టీ చేస్తున్న కసరత్తుకు ఇబ్బంది కలగకుండా జూన్ 2, 2014 నుంచి బదిలీలు నిర్వహించలేదు. తాజాగా ఉద్యోగుల పంపకం పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మంగళవారం బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులందరికీ బదిలీ అవకాశాన్ని కల్పించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ప్రత్యేక బదిలీలకు బ్రేక్.. రెండేళ్లుగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. ఈక్రమంలో సుదీర్ఘకాలంగా ఓకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈప్రక్రియ కొంత ఇబ్బంది కలిగించింది. ఈక్రమంలో కొందరు పైస్థాయిలో ప్రయత్నాలు చేసి ప్రత్యేక కేటగిరీలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కొందరైతే కోరిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. ఇలాంటి బదిలీలు పదుల సంఖ్యలో జరిగాయి. మరికొన్నిచోట్ల పరిపాలన విభాగం కింద ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో బదిలీలు చేశారు. తాజాగా ఇలాంటి బదిలీలకు బ్రేక్ పడింది. ఉద్యోగులందరికీ నిర్దిష్ట గడువును విధిస్తూ బదిలీలకు అవకాశం కల్పించింది. ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఆయా శాఖాధిపతులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.