breaking news
Goa chief
-
పదవి కోల్పోయిన గోవా ఆర్ఎస్ఎస్ ఛీఫ్
-
గోవా ఆరెస్సెస్ చీఫ్‌పై వేటు
పనాజీ: గోవా ఆరెస్సెస్ చీఫ్‌పై ఆరెస్సెస్ వేటు వేసింది. ఆయనను చీఫ్ బాధ్యతల నుంచి తొలగించింది. గోవాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, గోవా అరెస్సెస్ విభాగ చీఫ్ సుభాష్ వెలింకార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కారణంతో ఆయనపై వేటు వేసింది. 'గోవా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఆరెస్సెస్ చీఫ్ సుభాష్ వెలింకార్ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి' అని ఆరెస్సెస్ పబ్లిసిటీ చీఫ్ మన్మోహన్ వైద్యు బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు.