బీటెక్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి కాలేజీకి వెళ్లి అదృశ్యమయ్యాడు. హైదర్గూడ వాసి ఎం. హేమ ప్రసాద్ కుమారుడు ఈశ్వర్ తేజ్(19) స్థానిక వీఎన్నార్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన సాయితేజ్ సాయంత్రం తిరిగి రాలేదు. అతని దగ్గర ఉన్న రెండు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయి. తల్లిదండ్రులు కాలేజీలో విచారించగా సోమవారం కాలేజీకి వెళ్లలేదని తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు మిత్రులు, బంధువులను వాకబు చేశారు. ఫలితం కానరాక పోయేసరికి మంగళవారం ఉదయం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.