OTT: ఎలియో మూవీ రివ్యూ
హేయ్ కిడ్స్...మీకెవరికైనా ఏలియన్స్ ని చూడాలనుందా లేదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనుందా. అమ్మో అస్సలు లేదు అనుకుంటున్నారా..కాని ఎలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్ తీసుకువెళితే బావుండు అని అనుకుంటున్నాడు, అది కూడా ఎంతలా అంటే రోజూ బీచ్ కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి పడుకుండి పోతాడు. ఎప్పుడైనా ఓ ఏలియన్ తనను చూసి ఎత్తుకెళ్ళకుండా ఉంటదా అన్న చిన్న ఆశ ఎలియోకి. తన పేరెంట్స్ ని పోగొట్టుకోని ఎయిర్ ఫోర్స్ మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఎలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్చి, అందుకే తనను ఎత్తుకుపొమ్మని కనిపించిన సిగ్నల్స్ కి మెసేజ్ పెడుతుంటాడు ఎలియో. ఆ రోజు రానే వస్తుంది. ఎలియోని ఓ ఏలియన్ గ్రూప్ ఎత్తుకువెళుతుంది. ఏలియన్స్ గ్రూప్ లో గ్లోర్డన్ ఎలియోకి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడ నుండి వీళ్ళు చేసే అల్లరి, ఫాంటసీ అడ్వెంచర్స్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే. కిడ్స్ ఎలియో ఈజ్ ఎ సూపర్ మూవీ. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ టు జాయిన్ ఎలియో ఎలాంగ్ విత్ ఏలియన్స్.- హరికృష్ణ ఇంటూరు