breaking news
customers tention
-
25కు 24 కిలోలే..!
భువనగిరి : జిల్లాలో బియ్యం కొనుగోలుదారుల నమ్మకాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉండాల్సిన తూకం కంటే తక్కువ ఉన్న బియ్యం బస్తాలను విక్రయిస్తున్నారు. 25 కేజీల బియ్యం బ్యాగుల్లో అర కేజీ కొన్నిసార్లు 750 గ్రాముల వరకు తరుగుదల వస్తున్నాయి. ఈ లెక్కన వినియోగదారులు ప్రతి బ్యాగు మీద నెలకు రూ.18.40 పైసల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివిధ బ్రాండ్ల పేర్లతోవ్యాపారులు తక్కువ తూకం ఉన్న బియ్యం బ్యాగులను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. బియ్యం తక్కువ ఉన్నప్పటికీ నిర్ణీత ధరకే విక్రయిస్తుడటంతో విక్రయదారులు లాభపడుతూ విని యోగదారులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50నుంచి 60వరకు 25కేజీల బ్యాగులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి.వీటిల్లో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, అలేరు, రామన్నపేట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. జిల్లాలో బియ్యం అవసరాలు ఇలా.. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా మహిళలు 3,64,729, పురుషులు 3,74,719 ఉన్నారు. కుటుంబాలు 1,80,677 ఉన్నాయి. ప్రతి కుటుం బం సగటును ప్రతి నెలా 37కేజీల వరకు బియ్యం వినియోగిస్తున్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెలా జిల్లాలో 66,750 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో 45,169 కుటుం బాలు బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తుండగా మిగతా వారు వ్యవసాయం ద్వారా వచ్చిన బియ్యాన్ని వినియోగిస్తున్నారు. కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్న వారికి ప్రతి నెలా 16,712 క్వింటాళ్ల బియం అవసర పడుతుంది. ప్రతి నెలా రూ.23లక్షలు నష్టం సాధారణంగా మార్కెట్లో కొత్త బియ్యం 25 కిలోల బ్యాగుకు రూ.1,000కు, పాత వాటిని రూ.1,150కి అమ్ముతున్నారు. ఇందులో పాతవి కిలో రూ.46 వరకు, 100 గ్రాముల బియ్యానికి రూ.4.60 పైసలు ఉంటుంది. ప్రతి 25 కేజీల బ్యాగులో రూ.300 నుంచి రూ.500గ్రాముల వరకు బియ్యం తక్కువగా వస్తుండటం వల్ల ప్రతి నెలా ఒక్కో బ్యాగుపై రూ.18.40 వరకు వినియోగదారుడు నష్టపోతున్నాడు. కాగా బియ్యాన్ని కొ నుగోలు చేస్తున్న 45,169 కుటుంబాల్లో సుమారు 50శాతం అనగా వీరిలో 22,584 కుటుంబాలు తక్కువ బియ్యం వస్తున్న బ్యాగులను కొనుగోళ్లు చేస్తున్నారు. దీని ప్రకారం ఈ కుటుంబాలు ప్రతి నెలా రూ.4,15,554 నష్టపోతున్నారు. కొన్నిసార్లు కిలో వరకు తూకం తేడా ఉంటుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారు. లోకల్ బ్రాండ్లలో ఎక్కువగా.. సాధారణంగా జిల్లాలోని వ్యాపారులు బియ్యం బ్యాగులను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇందులో కొన్ని బ్యాగులు నాణ్యమైన బ్రాండ్ పేరుతో, మరికొన్ని లోకల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.ఎక్కువ శాతం లోకల్ బ్రాం డ్ పేరుతో వచ్చే 25 కేజీల బ్యాగుల్లో బియ్యం తక్కువగా వస్తున్నాయి. బ్యాగు పై 25 కేజీల బియ్యం ఉన్నట్లు ముద్ర ఉన్నప్పటికీ తూకం వేస్తే తక్కువగా ఉంటున్నాయి. జిల్లా జనాభా : 7,39,448 కుటుంబాల సంఖ్య : 1,80,677 ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి అవసరంఅయ్యే బియ్యం : 37 కేజీల వరకు ప్రతి నెలా మొత్తం కుటుంబాలకు కావాల్సిన బియ్యం :66,850క్వింటాళ్లు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేస్తున్న కుటుంబాలు : 45,169 వీరికి కావాల్సిన బియ్యం : 16,712 క్వింటాళ్లు బియ్యం తక్కువగా వస్తున్న బ్యాగులను కొనుగోలు చేస్తున్న కుటుంబాలు సగటున : 22,584 ప్రతి నెలా కుటుంబాలు నష్టపోతున్న ఆదాయం : రూ.23.22 లక్షలు 25 కిలోలు ఉండాల్సిందే.. నిబంధనల ప్రకారం 25 కేజీల బ్యాగులో 25 కిలోలు తప్పనిసరిగా ఉండాలి. తగ్గుదల ఉన్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిలా వ్యాప్తంగా బియ్యం విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తాం. తక్కువగా ఉన్నట్లు తేలినట్లయితే వెంటనే వారిపై కేసు నమోదు చేస్తాం. సరోజిని, తూనికల కొలతల శాఖ, జిల్లా అధికారి -
వామ్మో..క్యాష్లాస్ !
- నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీల భారం - 4 నుంచి 11శాతం వరకు వసూలు - ఆందోళనలో వినియోగదారులు ధర్మవరం : lధర్మవరం పట్టణంలోని మీ సేవ కేంద్రం నిర్వహకుడు శ్రీధర్.. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నా డు. అయితే ప్రతి నెలా రూ. 750 నెల సరి చార్జ్ (రెంటు) వసూలు చేస్తున్నా రు. అలాగే ప్రతి బిల్లుపైనా 12 నుంచి 14 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ కట్ అవుతోంది. దీంతో బిల్లులు చెల్లించేందుక వచ్చే వినియోగదారుడికి సమాధా నం చెప్పలేక నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ∙ధర్మవరం పట్టణానికి చెందిన రాజశేఖర్ పెట్రోల్ బంకుకు వెళ్లి రూ. 200 పెట్రోల్ వేయించుకుని స్వైపింగ్ చేస్తే రూ.210 డెబిట్ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. అదే సినిమా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.వంద టికెట్‌కు సర్వీస్ చార్జ్ కింద రూ.12 అకౌంట్లో కట్ అయ్యింది.. దీంతో సదరు వ్యక్తి నగదు రహిత లావాదేవీలు కాకుండా నగదు ఇచ్చే లావాదేవీలు నిర్వహించుకుంటున్నాడు. ఇ వి కేవలం శ్రీధర్, రాజశేఖర్ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు.. వర్తకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించా లని చెబుతున్నా ప్రభుత్వాలు ఆవిధం గా తగు ఏర్పాట్లు చేయకపోవడం, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయకపో వడంతో సర్వీస్ ట్యాక్స్‌ల పేరిట వినియోగదారుల నడ్డి విరుగుతోంది. ఏ చిన్న లావాదేవీ నిర్వహించినా రెండు నుంచి నాలుగు శాతం వరకు సర్వీస్ చార్జ్ రూపంలో కట్ అవుతోంది. జిల్లాలో కిరాణా దుకాణాలు, వస్త్ర దుకా ణాలు, గ్యాస్ ఏజెన్సీలు, హాస్పిటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ రూ. కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. సగటున రోజూ జిల్లాలో రూ.50 కోట్ల లావాదేవీలు జరిగాయనుకుంటే అందులో 30శాతం లావాదేవీలు నగదు రహితంగా జరిగితే కేవలం 4శాతం చొప్పున సర్వీస్ ట్యాక్స్ కింద రూ.12 కోట్లు పోతోంది. అలాగే çజిల్లాలో 300 దాకా పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు సగటున 1.5 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు, 3 లక్ష లీటర్ల మేర డీజిల్ విక్రయాలు జరుగుతాయి. ఇవి మొత్తం క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహిస్తే ఎంత మొత్తంలో సర్వీస్ ట్యాక్స్ కింద థర్డ్‌పార్టీకి (నిర్వహణ సంస్థలు) జమవుతుందో మీరే ఊహించండి. నోస్వైపింగ్ : ప్రస్తుత పరిస్థితుల్లో జేబు లో కార్డు ఉన్నప్పటికీ ఏ బ్యాంకు ఖాతాదారుడు స్వైపింగ్ చేయడానికి ఇష్టపడ టం లేదు. నగదు రహిత లావాదేవీల్లో రూ.100తో కొనుగోలు చేసే వస్తువుకు రూ.104 చెల్లించాల్సి వస్తోందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయే గానీ..సర్వీస్ చార్జీల భారం లేకుండా చేయలేకపోతున్నాయి. నిర్వహణ సంస్థలకు భారీ ఆదాయం : నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే బ్యాంకుల కంటే నిర్వహణ సంస్థలే అధికంగా లాభపడుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో సర్వీస్ చార్జీలు మొత్తం బ్యాంకులకు జమ కాదు. ఆ మొత్తం మాస్ట్రో, వీసా లాంటి నిర్వహణ సంస్థలకు పూర్తిగా వెళ్లిపోతాయి. రోజూ రూ.కోట్ల మేర సర్వీస్ చార్జీల కింద వారికి జమవుతోంది. ఇప్పటిౖకెనా ప్రభుత్వ పెద్దలు నగదు రహిత లావాదేవీల్లో సర్వీస్ ట్యాక్స్‌లు పూర్తిగా ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు.