breaking news
Cooperative House Building Society
-
ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమైతే జైలు తప్పదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమా లపై ఏర్పాటైన విచారణ కమిటీ రూపొందించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఇవ్వాల ని తాము ఆదేశిస్తే ఐదు నెలలైనా ఇవ్వకపోవడం సహకార శాఖ కమిషనర్ పూర్తి బాధ్యతా రాహిత్యమేనని హైకోర్టు మండిపడింది. ధిక్కరణ పిటిషన్ వేసి నోటీసులు జారీ చేశాక నివేదిక ఇస్తా రా? అంటూ కో–ఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎం.హరితను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు వింటామని.. ఒకవేళ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమైతే శిక్ష తప్ప దని కమిషనర్‌ను హెచ్చరించింది. కోర్టు ధిక్క రణ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించింది. కోర్టులంటే లెక్కలేనితనం సరికాదని.. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఇదీ నేపథ్యం..జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికను తనకు ఇప్పించాలంటూ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ గతంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని... 2022 మార్చి 23న విచారణ కమిటీ సమర్పించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో సహకార కమిషనర్‌ను ఆదేశించింది. అయితే గడువులోగా కమిషనర్ నివేదిక ఇవ్వకపోవడంతో జూన్‌లో మురళీ ముకుంద్ ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై గత విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్ హరితపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ హైకోర్టు ఆదేశాలు మే 6న అందాయని.. అవి పరిశీలన దశలో ఉండగానే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని కౌంటర్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి వల్ల నివేదిక ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని.. నివేదికను సెప్టెంబర్ 11న పిటిషనర్‌కు అందజేశామన్నారు. అయితే ఈ కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. దానిపై రిప్లై ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక ఏం చేయాలన్నది నిర్ణయిస్తామంటూ విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. కోర్టుకు హాజరు నుంచి కమిషనర్‌కు మినహాయింపు ఇచ్చింది. -
అమాత్యా ..తగునా
జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నిబంధనలు మరిచి మరీ సొసైటీ భూమిపై కన్నేశారు. రూ.2 కోట్ల విలువైన 66 సెంట్ల భూమి వివాదాల్లో ఉన్నా ‘ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్’ పేరిట శంకుస్థాపన చేసేశారు. ఆ భూమి ప్రభుత్వానిది కానప్పటికీ.. వివాదాల్లో ఉన్నా.. పనులు కానిచ్చేస్తున్న వైనంపై సొసైటీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నరసన్నపేటలో 1948లో ‘ది కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’ పేరిట 130మందికి సుమారు 16ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పంచాయితీలో 1952లో టౌన్‌ప్లానింగ్ నుంచి సభ్యులు అనుమతి తెచ్చుకుని ఇందిరానగర్ కాలనీ పేరిట లే అవుట్ వేసుకున్నారు. ప్రస్తుతం 80కుటుంబాలు స్థలంలో ఉంటున్నాయి. పాఠశాల, కళాశాల, దేవాలయం, శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. ఆ భూములపై తొలినుంచీ కన్నేసిన టీడీపీ అనుచరులు సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కోర్టుకెళ్లారు. దఫదఫాలుగా విచారణ జరిపి భూమి సొసైటీదేనని అధికారులు ధ్రువీకరించారు. సొసైటీ రికార్డుల పరిశీలన మేరకు కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. తర్వాత అదే ప్రాంతంలో సుమారు 66సెంట్ల ప్రాంతంలో రీడింగ్ రూం, విశ్రాంత గదులు నిర్వహించుకునేందుకు సభ్యులు నిర్ణయించుకున్నారు. దాతలు కూడా అంగీకరించి 16మందికి స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. పార్టీ నిర్మాణాల కోసం మంత్రిని రంగంలోకి దించారు. సీఎం పర్యటన తరువాతే హడావుడి గతేడాది ఆగస్టులో ఇక్కడ సీఎం నరసన్నపేట సందర్శించారు. ఆ సందర్భంలో భారీ పార్క్ నిర్మిస్తామని ఆయన చేత స్థానిక నేతలు హామీ ఇప్పించారు. స్థలం ఖాళీగా ఉందని, తమ ప్రాంతంలో పార్క్ కావాలంటూ స్థానిక ఎమ్మెల్యే ద్వారా సీఎంకు వినతిపత్రం అందించడం, సీఎం పార్క్ హామీ ఇచ్చేయడం తెరవెనుక జరిగిపోయిందని సొసైటీ సభ్యులు భావిస్తున్నారు. రోజురోజుకూ ఆ స్థలానికి విలువ పెరిగిపోతుండడంతో పార్క్ పేరిట టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. 1942లలో జనాభా, సౌకర్యాల ప్రాతిపదికన 5శాతం రిజర్వు స్థలం నిబంధన ఉండేదని, 2001 తరువాత అది 10శాతానికి పెరిగిందని, జిల్లా అధికారులు చెబుతున్నట్టు 40శాతం రిజర్వు అనేది రోడ్లతో కలిపి వ ర్తిస్తుందని, ఈ విషయం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవడం దారుణమని వాదిస్తున్నారు. ఏం చేస్తారో? గతంలో సొసైటీ స్థలంలో హక్కులు పొందిన వారి పేరిట ప్రస్తుతం అదే ప్రాంతంలో ప్రజాసదన్ పేరిట టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రిజర్వుగా ఉన్న స్థలంలో ఎర్రన్న పార్క్పేరిట స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. తమ ప్రాంతంలో మంత్రితో శంకుస్థాపన చేయించిన సమయంలో కనీసం సభ్యుల్ని ఆహ్వానించలేదని, ముందస్తు నోటీసులేవీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారా మధ్య నాయకగణం, అధికారుల సమక్షంలో వివాదంలో ఉన్న భూమిలో శంకుస్థాపన చేయడంపై మండిపడ్డారు. కలెక్టర్‌ను అడిగిన తరువాతే తాను కార్యక్రమం మొదలెట్టానని మంత్రి చెప్పుకురావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ భూముల్లో ఏవేని ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలన్నా, భవనాలు నిర్మించాలన్నా 40శాతం రిజర్వు స్థలం ఉండాలనే నిబంధన మేరకు గతంలోనే ఇక్కడ 40అడుగుల రోడ్డు సహా 16ఎకరాల స్థలంలో 40శాతం అంటే సుమారు ఆరెకరాల్ని రిజర్వుగా ఉంచినట్టు అధికారులకు రికార్డులు కూడా చూంపించామని సభ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ విస్తరణాధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావును వివరణ కోరగా ఈ అంశం తన పరిధిలో లేదని, కలెక్టర్ సహా పెద్దవాళ్లు ఏం చెబితే అది చేయడమే తన విధి అని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులే కీలక పాత్ర పార్కు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే పీఏ సహా ఓ వైద్యుడిపై అనుమానాలున్నాయి. ప్రజాప్రయోజనాల పేరిట స్థలం తీసేసుకుని తరువాత టీడీపీ ఏదైనా చేయొచ్చు. ఇళ్లు కట్టేయడమో, ఎర్రన్న విగ్రహం ముందు పెట్టి దాని తరువాత క్వార్టర్లు కట్టించేయోడమో జరగొచ్చు. పార్క్ కోసం శంకుస్థాపన అయితే అక్కడ శిలాఫలకాలేవీ? కేవలం సభ్యుల స్థలంపై టీడీపీ కన్నేయడంతోనే ఇలా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ స్థలంలో శంకుస్థాపనా? సొసైటీ అనుమతి పొందకుండానే టీడీపీ నేతలు పార్క్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. 16మంది పొట్టకొట్టాలని చూస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం కూడా ఆలోచించలేదు. ఇళ్ల నిర్మాణం కోసం దాతలు రిజిస్ట్రేషన్ చేయించిన స్థలంలో కేటాయిస్తే పార్క్ ఎలా కడతారు? టంకాల అర్జున్, బోర్డు సొసైటీ అధ్యక్షుడు. రిజర్వు సైట్లలో ప్లాట్లు ఎలా ఇస్తారు? కో ఆపరేటివ్ సెక్టార్లో రిజర్వు సైట్ పరిధిలో ప్లాట్లు ఎలా విభజించారన్న విషయం మా పరిధిలో ఉంటుంది. మద్రాస్ యాక్ట్ ప్రకారం పరిశీలిస్తున్నాం. రోడ్లతో పాటు 40శాతం రిజర్వు స్థలం ఉండాలి. అందుకనే పార్కు నిర్మిస్తున్నారని భావిస్తున్నాం. సభ్యులు తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్‌నూ కలిశారు. శ్రీహరి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి.