breaking news
chennur hospital
-
పశువుల కాపరిపై పులి పంజా
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పశువుల కాపరిపై పులి దాడి చేసింది. బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే నక్కలపల్లి అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. ఒక్కసారిగా పశువులపై పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో అతనిపై పంజా విసిరింది. దీంతో వెంకటయ్య గాయపడ్డాడు. అతి కష్టం మీద గ్రామ సమీపంలోకి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యుడు ప్రథమ చికిత్స అందించాడు. మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పులి పాదముద్రలను చూసారు. దాడి చేసింది పులి అని గుర్తించారు. -
చికిత్స పొందుతూ వ్యవసాయ కూలీ మృతి
ఆదిలాబాద్(చెన్నూరు): ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామంలో పొలానికి క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తూ అపస్మారకస్థితిలోకి వెళ్లిన వ్యవసాయకూలీ గాదరి రాజు(20) గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. పొలంలో మధ్యాహ్నాం అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే రాజుని చికిత్స నిమిత్తం స్థానిక చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కు తీసుకెళ్లగా అక్కడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం అర్థరాత్రి మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.