breaking news
chemical business
-
రిలయన్స్ భారీ పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. దీనిలో భాగంగా చమురు, రసాయనాల(ఆయిల్ టు కెమికల్స్–ఓటూసీ) విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. తదుపరి కంపెనీలో సౌదీ అరామ్కో వంటి వ్యూహాత్మక విదేశీ ఇన్వెస్టర్‌కు వాటాను విక్రయించనుంది. తద్వారా వాటాదారులకు మరింత విలువను చేకూర్చాలని యోచిస్తోంది. ఓటూసీ బిజినెస్‌కు మాతృ సంస్థ నుంచి 25 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.81 లక్షల కోట్లు) రుణం లభించనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ద్వారా ఓటూసీ వేల్యూ చైన్‌లో లభించనున్న అవకాశాలపై దృష్టిపెట్టేందుకు వీలు చిక్కనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో సొంతంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశముంటుందని వివరించింది. కంపెనీ కోసం ప్రత్యేకించిన యాజమాన్య టీమ్, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం.. తదితరాలతో పటిష్టతను సంతరించుకోనుందని పేర్కొంది. హోల్డింగ్ కంపెనీగా.. ఆర్ఐఎల్కు చెందిన చమురు రిఫైనరీ, పెట్రోకెమికల్ ఆస్తులు, రిటైల్ ఇంధన బిజినెస్‌లతో ఓటూసీ ఏర్పాటుకానుంది. అయితే ఆయిల్, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కేజీ డీ6 క్షేత్రాలు, టెక్స్టైల్ బిజినెస్‌లు ఓటూసీలో భాగం కాబోవని ఆర్ఐఎల్ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ తదుపరి ఆర్ఐఎల్ కేజీ–డీ6తో కూడిన చమురు, గ్యాస్ వెలికితీత, ఉత్పత్తి బిజినెస్‌లతోపాటు.. ఫైనాన్షియల్ సర్వీసులు, ట్రెజరీ, టెక్స్టైల్ బిజినెస్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా నిలవనుంది. ఇతర బిజినెస్‌లు... ఆర్ఐఎల్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహిస్తోంది. టెలికం, డిజిటల్ వెంచర్స్‌ను జియో ప్లాట్‌ఫామ్స్ కలిగి ఉంటుంది. రిలయన్స్ రిటైల్‌లో 85.1 శాతం, వాటా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 67.3 శాతం చొప్పున ఆర్ఐఎల్కు వాటాలున్నాయి. మిగిలిన రూ. 2 లక్షల కోట్ల విలువైన వాటాలను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఫేస్బుక్, గూగుల్ తదితరాలకు కేటాయించిన విషయం విదితమే. పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్న ఓటూసీకి ఫ్లోటింగ్ రేటుపై పదేళ్ల కాలానికి రుణాన్ని ఆర్ఐఎల్ అందించనుంది. ఈ రుణాలను చమురు, గ్యాస్ రంగంలో ఆస్తుల కొనుగోలుకి ఓటూసీ వినియోగించనుంది. వచ్చే ఏడాది(2021–22) ద్వితీయార్థంలో ఓటూసీ ఏర్పాటుకు అన్ని అనుమతులూ లభించగలవని ఆర్ఐఎల్ అంచనా వేస్తోంది. ఓటూసీలో భాగం ప్రత్యేక కంపెనీగా ఆవిర్భవించనున్న ఓటూసీకి ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ప్లాంట్లు, తయారీ యూనిట్లతోపాటు.. బ్రిటిష్ పెట్రోలియంతో ఏర్పాటు చేసిన ఇంధన రిటైల్ మార్కెటింగ్ జేవీలో ఆర్ఐఎల్కు గల 51 శాతం వాటా బదిలీకానుంది. సింగపూర్, యూకేలలోని అనుబంధ చమురు ట్రేడింగ్ సంస్థలు, ఉరుగ్వే పెట్రో మార్కెటింగ్ సంస్థను సైతం సొంతం చేసుకోనుంది. గుజరాత్, మహారాష్ట్ర మధ్య ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇథేన్ పైప్‌లైన్, సిబూర్ జేవీలో ఆర్‌ఐఎల్‌కుగల దాదాపు 75 శాతం వాటాను పొందనుంది. -
కుమార్తెపైనే తండ్రి లైంగిక వేధింపులు?
టీనగర్ (చెన్నై): తన తండ్రి లైంగికంగా వేధించి, నిర్బంధించినట్లు ఓ మహిళా డాక్టర్ మహిళా పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన లూర్థురాజ్ చెన్నైలో కెమికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి భార్య వసంత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ప్రస్తుతం వీరు చెన్నై ఎర్నావూరు రామకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె నందిని చెన్నైలో ప్రైవేటు దంత వైద్యురాలిగా పని చే స్తున్నారు. నందినికి మానసిక స్థితి సరిలేదని చెప్పి ఆమె తండ్రి, బంధువులు పాళయంకోట్టైలోని మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. అక్కడికి నందినితో పనిచేసిన డాక్టర్, స్నేహితురాళ్లు వచ్చారు. దీంతో నందిని వారికి జరిగిన సంఘటన గురించి తెలుపగా వారు నందినితో మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతలోనే హోం నుంచి నందినిని కిడ్నాప్ చేసినట్లు హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. పోలీసుల విచారణలో అనేక వివరాలు వెలుగు చూశాయి. నందిని మానసిక రోగి కాదని, చదువుతున్న సమయంలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిందని, తండ్రి లూర్థురాజ్ కుమార్తెను లైంగికంగా వేధించడంతో, ఆమె 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. వెంటనే ఆమెను పాళయంకోట్టైలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి పాళయంకోట్టైలో గల మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి లూర్థురాజ్తోపాటు అతనికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నారు. తండ్రిపై అభాండాలు: తల్లి వసంత వివాహమైన డాక్టర్‌తో నందినికి సంబంధం వున్నందున దీనిని దారి మళ్లించేందుకే తండ్రిపై అభాండాలు వేస్తున్నట్లు నందిని తల్లి వసంత ఆరోపించారు. చెన్నైకు చెందిన డాక్టర్ దినేష్ తన మొదటి భార్య వుండగానే ఆస్పత్రిలో పనిచేస్తున్న మరొక మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వివాహాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అతను తన కుమార్తెను లొంగదీసుకున్నాడని, అతడి ప్రేమ మోహంలో ఉన్న నందిని తన తండ్రిపైనే అభాండాలు వే స్తోందని వసంత తెలిపారు.