breaking news
challo assembly
-
ఛలో అసెంబ్లీ...ముందస్తు అరెస్ట్‌లు
సాక్షి, అమరావతి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమరావతిలో అసెంబ్లీతో పాటు, సచివాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐడీ కార్డులు చూపించిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. గుంటూరులో సీపీఐ నేతలను, అలాగే గతరాత్రి నుంచే సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌ను పాతగుంటూరు పీఎస్‌లోనే ఉంచారు. ఇక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడలో పోలీసులు మందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ నేతలు, రంపచోడవరంలో సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు ముందస్తు అరెస్ట్‌లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌లు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
త్వరలో 'చలో హైదరాబాద్': కోదండరాం
త్వరలో టి.జేఏసీ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్'ను నిర్వహిస్తామని ఆ జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 4 - 7 తేదీల మధ్యలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. చలో అసెంబ్లీ అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. శాంతిని ప్రతిబింబించే విధంగా చలో 'హైదరాబాద్' కార్యక్రమం ఉంటుందని కోదండరాం వివరించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోదండరాం నిప్పులుచెరిగారు. సీఎం కిరణ్ తెలంగాణ ప్రజలను హైదరాబాద్‌లో ఉండనివ్వడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కాందిశీకులుగా మారుస్తాడని కోదండరాం ఆరోపించారు. కిరణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం పర్థం ఉండదని అన్నారు. విభజనను అడ్డుకోవడానికి టి.ఎమ్మెల్యేలను కొంటామని సీమాంధ్రులంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అని కోదండరాం స్ఫష్టం చేశారు.