breaking news
ccs police stations
-
ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు
సాక్షి, సిటీబ్యూరో: ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నట్లు ప్రదీప్ జోషిపై సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన మూడో భార్య డాక్టర్ శ్రేయ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు వల్లించే ప్రదీప్ జోషి వాస్తవ జీవితంలో మాత్రం దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన చెప్పే ధర్మం కేవలం పుస్తకాలకే పరిమితం, అది ఎదుటి వారికి చెప్పడానికే.. ఫాలో అవ్వడానికి కాదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. తమ పెళ్లి సమయంలో అలేఖ్యతో వివాహం, విడాకులు, బాబు ఉన్న విషయం మాత్రమే చెప్పారు. మరో యువతి లక్ష్మీ ప్రత్యూషతో వివాహమైన విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. అమాయక అమ్మాయిల్ని మోసం చేయడంతో పాటు వారిని వదిలించుకోవడానికి వారినే బ్లేమ్ చేస్తుంటాడని, గత ఏడాది మార్చిలో తమ వివాహమైందని, ఆ తర్వాత ఆరు నెలలకే తనను వదిలించుకోవాలని చూశాడని శ్రేయ చెప్పారు. ఒక దశలో తాను పుట్టింటికి వెళ్లినప్పుడు తిరిగి రానీయకుండా గేటుకు తాళం వేశాడని, పోలీసు కేసు పెట్టిన తర్వాత కౌన్సెలింగ్‌కు రాకుండా కరోనా పేరుతో తప్పించుకున్నాడని ఆమె ఆరోపించారు. -
'సముద్రతీరం వెంబడి ప్రత్యేక నిఘా'
ఒంగోలు (ప్రకాశంజిల్లా): గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలో సముద్రతీరం వెంబడి నిఘా పెంచుతున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఒంగోలుకు గురువారం మొదటిసారి వచ్చారు. సర్కిళ్ల వారీగా శాంతిభద్రతల అంశం, నేరాలు, దొంగతనాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తీరం వెంబడి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలో కోస్ట్‌గార్డ్ పోలీసులతో మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్నందున అక్కడ మహిళా పోలీసుల అవసరం ఉందని చెప్పారు. మహిళా సిబ్బందిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లను ప్రత్యేక నేరాల వైపు దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీసీఎస్ పోలీస్స్టేషన్ల సిబ్బందిని సమన్వయపరిచి నేరాల అదుపునకు చొరవ చూపుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శిద్దా రాఘవరావుపై ఎన్బీడబ్ల్యూ ఉన్నా ఇంత వరకు పోలీసులు చర్యలు చేపట్టలేదని విలేకరులు అడగ్గా...అలాంటి వాటిని ఎస్పీ పరిశీలిస్తారన్నారు. సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.