breaking news
bundi district
-
రాహుల్ జోడో యాత్రలో ప్రియాంక కూతురు.. ఫోటోలు, వీడియోలు వైరల్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఈనెల 5వ తేదీన జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశించింది. తాజాగా రాహుల్ యాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కుటుంబం పాల్గొంది. సోమవారం(96వ రోజు) బుండీ జిల్లాలోని తేజాజీ మహారాజ్ వద్ద ఉదయం 6 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమవ్వగా.. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయాతో సహా వందలాది మహిళలు రాహుల్‌తో కలిసి పర్యటించారు. మహిళా సాధికారత పేరుతో సాగుతున్న సోమవారం నాటి జోడోయాత్రలో అధిక సంఖ్యలో మహిళలు రాహుల్‌తో కలిసి నడుస్తుండటంతో దీనిని ‘నారీ శక్తి పాదయాత్ర’గా అభివర్ణించింది కాంగ్రెస్. కోటా-లాల్సోట్ మెగా హైవేపై రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు. Smt @priyankagandhi in the #BharatJodoYatra today. pic.twitter.com/aEBKVpncYr — Lavanya Ballal (@LavanyaBallal) December 12, 2022 చలిని కూడా లెక్కచేయకుండా దాదాపు 5,000పైగా మహిళలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అంతా కలిసి బాబాయి గ్రామం నుంచి స్వైమాధోపూర్ జిల్లాలోని పిపాల్వాడ వరకు నడిచారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత कहीं दूर तक ज़मीं नजर नहीं आती है ये तुम्हारी मोहब्बतों का असर है। वाह राजस्थान...#BharatJodoYatra pic.twitter.com/0hf4cel4gW — Congress (@INCIndia) December 12, 2022 కాగా రాహుల్ రాజస్థాన్‌లో గత ఏడు రోజులుగా పర్యటిస్తున్నారు. బుండీ జిల్లాలో ఇది చివరి రోజు. అనంతరం టోంక్ జిల్లాలోకి ప్రవేశించారు. డిసెంబర్ 21న హర్యానా రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నారు. గత 17 రోజుల్లో దాదాపు 500 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. అయితే జోడో యాత్ర మొత్తంలో ఇప్పటి వరకు తిరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ మాత్రమే. ఇక సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగింది. మొత్తం 150 రోజుల్లో 3,570 కి.మీ.లు ప్రయాణించి 2023 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో ముగియనుంది. Mr @RahulGandhi , Ms @priyankagandhi #BharatJodoYatra #Rajasthan pic.twitter.com/O4A9hDstZv — Supriya Bhardwaj (@Supriya23bh) December 12, 2022 -
9 లక్షల కేసులు పరిష్కారం
బండీ: న్యాయం మీ ఇంటి ముందుకు(జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్) ప్రచారంతో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన లోక్ అదాలత్ లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పటివరకు లోక్ అదాలత్ ల ద్వారా గ్రామాల్లో భూమి వివాదాలకు సంబంధించిన 9 లక్షల కేసులు పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 4 వేల లోక్ అదాలత్ లతో ఈ కేసులు పరిష్కరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మే 18 నుంచి ప్రారంభమైన లోక్ అదాలత్ లు జూలై 15 వరకు కొనసాగనున్నాయి. పంచాయతీ కారాలయాల్లో లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్, రాజీ కుదర్చడం ద్వారా కేసులు పరిష్కరిస్తున్నారు. బండీ జిల్లాలో 996 రెవెన్యూ కేసులు పరిష్కారమయ్యాయని కలెక్టర్ నెహా గిరి తెలిపారు.